Brendan Frazer: ఆస్కార్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న బ్రెండన్ ఫ్రేజర్
Brendan Frazer gets Oscar best actor Award
ఆస్కార్ అవార్డు సాధించడం అనేది ప్రతి నటుడి జీవితంలోను ఒక పెద్ద ఎచీవ్ మెంట్. అటువంటి అవార్డు దక్కించుకోవడంతో ప్రపంచ వ్యాప్తంగా మరింత గుర్తింపు పెరుగుతుంది. అవార్డు అందుకున్న ఆ క్షణాలు జీవితాంతం మరుపురాని మధుర క్షణాలుగా నిలిచిపోతాయి. హాలీవుడ్ నటుడు బ్రెండన్ ఫ్రేజర్ అటువంటి అనుభూతినే పొందాడు. ఆస్కార్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నాడు. భావేద్వేగానికి గురయ్యాడు. కన్నీటి పర్యంతం అయ్యాడు. తనకు లభించిన అవార్డు పట్ల ఉబ్బితబ్బిబ్బయ్యాడు.
సైకలాజికల్ డ్రామా వేల్స్ సినిమాలో బ్రెండన్ ఫ్రేజర్ చేసిన అద్భుత నటనకు గాను బెస్ట్ యాక్టర్ అవార్డు లభించింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ ఇంగ్లిష్ ప్రొఫెసర్ క్యారెక్టర్ చేసిన బ్రెండన్ ఫ్రేజర్ అదరిపోయే నటనతో ఆకట్టుకున్నాడు. ఎంతో సంక్లిష్టమైన పాత్రను పోషించి అందరి మన్ననలు పొందాడు.
అకాడమీ అవార్డుల నామినేషన్ల ప్రక్రియ మొదలైన నాటి నుంచి బ్రెండర్ ఫ్రేజర్ పేరు మార్మోగుతూ వస్తోంది. ఈ సారి ఖచ్చితంగా ఫ్రేజర్ కు అవార్డు ఖాయమని విస్తృతస్థాయిలో ప్రచారం జరిగింది. వేల్స్ సినిమాలో కనబరిచిన అద్భుతమైన నటన ఆస్కార్ అవార్డు తెచ్చిపెడుతుందని సినీ ప్రముఖులు ముందుగానే ఊహించారు. వారి ఊహలన్ని నిజమయ్యాయి. బ్రెండన్ ఫ్రేజర్ అవార్డు దక్కించుకున్నాడు.
Brendan Fraser wins best ACTOR at the academy awards!!! #thewhale #bestactor #oscars #AcademyAwards pic.twitter.com/PMMecxSxNy
— edgargein_singz (@edgargein) March 13, 2023
Brendan Frazer