Prabas: టెన్షన్ పడుతున్న ప్రభాస్ ఫాన్స్ కారణం?
Prabhas:నాగార్జున ,అమితాబ్, రణబీర్ కపూర్, అలియాభట్ జంటగా నటించిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాలీవుడ్ లో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ సినిమా ఇది.తెలుగు ట్రైలర్ కి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చాడు . ఇక ఈ ప్రాజెక్ట్ ను రాజమౌళి తెలుగులో సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. దీంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది.
సౌత్ సినిమాలలో ట్రైలర్ చుస్తే గ్రాఫిక్ నిడివి తక్కువ చేసి వదులుతారు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’, రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని బాలీవుడ్ భావించింది. కానీ ట్రైలర్ చూసిన తరువాత బాగుందనిపించినా… ఈ చిత్ర ట్రైలర్ మొత్తాన్ని గ్రాఫిక్స్ తో నింపేశారు. ట్రైలర్ చూస్తున్నంత సేపు చిన్న పిల్లలు ఆడుకునేగేమ్ షో లా ఉంది అని కామెంట్స్ చేస్తున్నారు. గ్రాఫిక్స్ పరంగా ఈ సినిమా తేలిపోయింది. ‘బ్రహ్మాస్త్ర’ ట్రైలర్ చూసిన వారంతా.. ప్రభాస్ ‘ఆదిపురుష్’పై బెంగ పెట్టుకుంటున్నారు.
బాహుబలి చిత్రం తో ప్రభాస్ రేంజ్ ఏంటో దేశం మొత్తం తెలిసి పోయింది. ఇప్పుడు రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా ‘ఆదిపురుష్’. ఈ సినిమాకి వీఎఫ్ఎక్స్ చాలా అవసరం. సినిమాలో ఎక్కువ శాతం సన్నివేశాలను వీఎఫ్ఎక్స్ లోనే చేయాలి. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ‘బ్రహ్మాస్త్ర’ సినిమాకి పని చేసిన వీఎఫ్ఎక్స్ స్టూడియోలో ‘ఆదిపురుష్’ సినిమాకి కూడా వర్క్ జరుగుతుంది. ఈ విషయం ప్రభాస్ ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతోంది.
‘ఆదిపురుష్’ సినిమా 2023 జనవరి లో విడుదల అవుతుంది. విడుదలకి ఇంకా సమయం ఉంది కాబట్టి కొంచం ఓపిక పడితే వీఎఫ్ఎక్స్ ను సరిగ్గా వాడుకోవాలని ఫాన్స్ అంటున్నారు.ఇంకా సమయం ఉంది కాబట్టి గ్రాఫిక్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని ఫిలిం వర్గాల నుండి వస్తున్న సమాచారం.