Balayya vs Chiranjeevi: వీర వర్సెస్ వీరయ్య
Balayya vs Chiranjeevi: సంక్రాంతికి ఈ సారి ఇద్దరూ స్టార్ హీరోలు అమి తుమీ తేల్చుకోనున్నారు. బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రం రిజల్ట్ వచ్చేసింది. ఇక మెగాస్టార్ చిరంజీవీ నటించి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం మరికొద్ది గంటల్లో విడుదల కానుంది. మొత్తంగా ఇద్దరు పెద్ద హీరోలతో సినిమాలు తీస్తున్నా అనే ఆనందం కన్నా.. రెండు చిత్రాలను ఒకేసారి పోటీలో నిలబడటం ఇపుడు నిర్మాతలకు సవాల్‌గా నిలిచింది. ఇద్దరు లెజండరీ హీరోలతో పందానికి సై అంటూ బరిలో దిగింది. ఇప్పటి వరకు 19 సార్లు బాక్సాఫీస్ దగ్గర పోటీపడ్డ బాలయ్య, చిరంజీవి.. సంక్రాంతి బరిలో మాత్రం 10 సార్లు పోటీ పడ్డారు. ఇపుడు 11వ సారి.. దీంతో చిరు-బాలయ్య అభిమానులు పోటెత్తిన వరద ప్రవాహంలా సినిమా థియేటర్ల వైపు వస్తున్నారు.
సంక్రాంతి సీజన్ వచ్చిందటే చాలు.. బాక్సాఫీస్ ముందు అగ్ర హీరోల సినిమాలు రిలీజవ్వడం కామనే. ఇది ఇప్పటినుండి కాదు.. దాదాపుగా గత 30 ఏళ్ళనుండి వస్తుంది. అందుకే స్టార్ హీరోలు, దర్శక నిర్మాతలు ఈ సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు తమ చిత్రాలను విడుదల చేయాలని తహ తహలాడుతుంటారు. ఈ సారి మెగాస్టార్ చిరంజీవితో పాటు నందమూరి నటసింహం బాలకృష్ణ ఇద్దరూ బాక్సాఫీస్ బరిలోకి దిగారు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలు ఈ సారి సందడి చేస్తున్నాయి. ఈ రెండు చిత్రాలకూ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు కావడం విశేషం. అంతేకాకుండా ఈ రెండింట్లోనూ శృతి హాసనే హీరోయిన్. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే వీర- వీరయ్య అనే పదాలు కొత్తగా వినిపిస్తున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో ఈ సినిమాలకు బిజినెస్ జరిగిందని టాక్ జరుగుతోంది. మరి బాలయ్య సినిమా మిక్స్డ్ టాక్ రాగా మరికొద్ది గంటల్లో వీరయ్య భవితవ్యం తేలనుంది.
ఈ సినిమాల బిజినెస్ చూస్తే ‘వీరసింహారెడ్డి’ చిత్రానికి రూ.100 కోట్లు కాగా.. చిరంజీవి చిత్రానికి రూ.140 కోట్లు ఖర్చు చేసినట్లు ఫిల్మ్ వర్గాల అంచనా. ఇందులో రెమ్యూనరేషన్ కూడా ఉంది. వీరసింహారెడ్డి కోసం బాలయ్య రూ.15 నుండి 25 కోట్ల తీసుకున్నట్లు సమాచారం. మరోపక్క వాల్తేరు వీరయ్య కోసం మెగాస్టార్, మాస్ మహారాజా ఇద్దరూ కలిసి రూ.50 కోట్ల వరకు తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఇరు చిత్రాలకు బడ్జెట్ వంద కోట్లకు పైనే అయినట్లు అంచనా వేశారు. ఒక నిర్మాత ఇద్దరు లెజండరీ హీరోలతో తెరకెక్కించిన సినిమాలను సంక్రాంతి బరిలో దింపడం ఇదే తొలిసారి. టాలీవుడ్‌లో ఒక నిర్మాణ సంస్థ నిర్మించిన సినిమాలు ఒకేసారి పోటీలో దిగడం ఇది ఒక రికార్డు అనే చెప్పాలి.
ఇలా ఏ సంక్రాంతికి జరుగలేదు. కానీ ఈసారి మాత్రం ఒక ఇంట్లోనుండి ఇద్దరు బయటకు వచ్చినట్టు. ఒకే ప్రొడక్షన్ హౌస్ నుండి ఇద్దరు అగ్ర హీరోలు వచ్చారు. ముందుగా ‘వీరసింహారెడ్డి’ సినిమాను గతేడాది దసరాకు విడుదల చేద్దామనుకున్నారు. అప్పుడు కూడా బరిలో చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమా పోటికొచ్చింది. అప్పుడు బాలయ్య కోవిడ్ బారిన పడడంతో తో షూటింగ్ కొంత ఆలస్యం అయింది. ఇక అప్పుడు చిరంజేవి ఒక్కడే దసరా ను క్యాష్ చేసుకున్నాడు. ఆ తరువాత డిసెంబర్ లో విడుదల చేద్దామనుకున్నారు కానీ బాలయ్యకు సంక్రాంతి సెంటిమెంట్ ఉందని కాబట్టి..’వీర సింహారెడ్డి’ ని బరిలోకి దింపారు మేకర్స్. కానీ ఇక్కడ మరో సమస్య కూడా ఎదురవనుంది..అదే థియేటర్స్ సమస్య రెండు ప్రొడక్షన్ హౌస్ లలో అయితే అది నిర్మాతలు చూసుకుంటారు. కానీ ఇక్కడ రెండు సినిమాలకు మైత్రి మూవీ నే నిర్మాణ సంస్థ.. మరి మరికొద్ది గంటల్లో వీర తప్పుకుని వీరయ్యకు చోటిస్తాడా అనే ప్రశ్న కూడా రేకిత్తిస్తోంది.
థియేటర్ మార్కెట్ చుస్తే ఈ రెండు చిత్రాలకు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ మార్కెట్ భారీగానే ఉంది. ఆంధ్ర ప్రాంతంలో రెండు సినిమాలకు కలిపి రూ.75 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో వీరసింహారెడ్డికి రూ.35 కోట్లు .. వాల్తేరు వీరయ్యకు రూ.40 కోట్లు. అలాగే సీడెడ్‌లో ఈ రెండు చిత్రాలకు రూ. 27 కోట్ల వరకు ఉన్నట్లు అంచనా. ఇందులో బాలయ్య చిత్రానికి రూ.12.5 కోట్లు కాగా.. మెగాస్టార్ మూవీకి రూ.14.5 కోట్లు. నైజాం ప్రాంతంలో రెండు సినిమాలకు కలిపి రూ.33 కోట్ల బిజినెస్ జరిగిందని సమాచారం. ఇందులో వీరసింహారెడ్డి షేర్ రూ.15 కోట్లు కాగా.. వాల్తేరు వీరయ్యకు రూ.18 కోట్లుగా ఉంది. అన్ని ప్రాంతాలు కలిపి నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్‌గా ఇవ్వడమైంది. కాబట్టి ఓవర్ ఫ్లో ఉంటే నిర్మాతలకు ఎక్కువ వస్తుంది. ఒకవేళ మిక్స్‌డ్ టాక్ వస్తే నిర్మాతలు రూ.30 కోట్ల వరకు జీఎస్‌టీ ఖర్చులను భరించాల్సి వస్తుంది. ఈ రెండు చిత్రాలకు కలిపి తెలుగు రాష్టాల్లో రూ.135 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని ఇండస్టీ టాక్.
వాల్తేరు వీరయ్య సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కిస్తే వీరసింహారెడ్డిని గోపీచంద్ మలినేని తెరకెక్కించాడు ఇక్కడ మరో విశేషం ఏంటంటే..ఇద్దరు ఈ అగ్ర హీరోల ఫ్యాన్స్ కావడం విశేషం. ఇక వీరసింహారెడ్డి సినిమాను ఏపీ గవర్నమెంట్ పై పరోక్షముగా పంచులువేశాడని అంటున్నారు. మరి రేపు విడుదలయ్యే వీరయ్య ఎవరిమీద రివెంజ్ తీర్చుకోబోతున్నాడో చూడాలి మరి.