Prabas:ప్రభాస్ రెమ్యూనరేషన్ గురించి బాలీవుడ్ లో కొత్త చర్చ!
Bolly Wood Sensational Comments About Prabas:ఇండియాలో నెంబర్ వన్ హీరో ఎవరు..? ఈ ప్రశ్నకు సమాధానంగా గతంలో చాలా మంది హీరోల పేర్లు వినిపించేవి. కానీ ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ ఇండియా నెంబర్ వన్ హీరో అనిపించుకుంటున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియన్ హీరో అయిపోయాడు. ఆ సినిమాతో వచ్చిన మార్కెట్ అంత ఇంత కాదు. ఈ క్రెడిట్ అంత రాజమౌళి కె చెందుతుంది. ఆ తరువాత వచ్చిన సాహో,రాధే శ్యామ్ సినిమాలు ఆకట్టుకోలేక పోయాయి.
ప్రభాస్ ఇప్పుడు చాలా జాగ్రత్తగా యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథల వైపు అడుగులువేస్తున్నాడు. ప్రస్తుతం కేజిఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్, ఓం రౌత్ లాంటి పాన్ ఇండియన్ దర్శకులతో ప్రభాస్ వర్క్ చేస్తున్నాడు. ప్రభాస్ సినిమాల కోసం వందల కోట్ల బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. ఒక్కో సినిమాకు 400 కోట్ల నుంచి 500 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారు. దీన్నిబట్టి ప్రభాస్ రేంజ్ ఏంటి అనేది అర్థం అవుతుంది.
ఆర్ఆర్ఆర్, కేజిఎఫ్ 2 రెండు సౌత్ సినిమాలే భాషే తేడా..అంతే దాదాపు వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లు సాధించడం జరిగింది. బాలీవుడ్ సినిమా ఈ రేంజ్ లో సౌత్ సినిమాలకు పోటీ ఇవ్వలేకపోతున్నాయి. ఇప్పుడు ప్రభాస్ రెమ్యూనరేషన్ పై రకరకాల వార్తలు బాలీవుడ్ లో ప్రచారం అవుతున్నాయి.ఓమ్ రౌత్ దర్శకత్వంలో “ఆది పురుష్” పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రభాస్ ఏకంగా 120 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది.
ఆదిపురుష్ సినిమా మొదలు కాగానే ప్రభాస్ రెమ్యునరేషన్ 90 కోట్ల రూపాయల ఉండేదని కానీ ఇప్పుడు.. బాలీవుడ్ నిర్మాతల నుండి 120 కోట్లు డిమాండ్ చేస్తున్నాడనే వార్తలు బాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.