Satish Kaushik: బాలీవుడ్ లో విషాదం..ప్రముఖ నటుడు దర్శకుడు కన్నుమూత
Satish Kaushik: ఫిల్మ్ ఇండస్ట్రీని వరుస విషాదాలు ముంచెత్తుతున్నాయి. స్టార్లు వరుసగా తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతున్నారు. అన్ని భాషల్లో ఇదే పరిస్థితి నెలకొంది. తాజాగా బాలీవుడ్ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకున్నది. ప్రముఖ నటుడు, దర్శకుడు సతీశ్ కౌశిక్ కన్నుమూశారు. కోవిడ్ బారిన పడిన సతీష్.. అప్పటి నుంచీ పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు..ఈ రోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారని బాలీవుడ్ సినీ వర్గాలు పేర్కొన్నాయి.
సతీశ్ కౌశిక్ 1956, ఏప్రిల్ 13న హర్యానాలో జన్మించారు. 1983లో వచ్చిన ‘మాసూమ్’ సినిమాతో చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. దాదాపుగా వందకు పైగా సినిమాలకు పనిచేశారు. 1990లో రామ్ లఖన్, 1997లో సాజన్ చలే ససురాల్ సినిమాలకుగాను ఫిల్మ్‌ఫేర్‌అవార్డు అందుకున్నారు. అలాగే సతీశ్ కౌశిక్ పది సినిమాలకు దర్శకత్వం వహించారు. 2007లో అనుపమ్ ఖేర్‌తో కలిసి కరోల్ బాగ్ ప్రొడక్షన్స్ అనే సినిమా కంపెనీని ప్రారంభించారు. ఆయన మరణం పట్ల బాలీవుడ్ సినీ లోకం శోకసంద్రంలో మునిగింది.
నటుడు అనుపమ్ కేర్ సతీష్ ఫోటోను శేర్ చేస్తూ.. మరణం ఈ ప్రపంచంలోని చివరి సత్యం అని నాకు తెలుసు అంటూ అనుపమ్ ట్వీట్ చేశారు. అయితే బ్రతికున్నప్పుడు నా ప్రాణ స్నేహితుడు సతీష్ కౌశిక్ గురించి ఇలా రాస్తాను అని అనుకోలేదు 45 ఏండ్ల తమ స్నేహం ఈరోజుతో ముగిసిందని ట్వీట్‌లో పేర్కొన్నారు.
जानता हूँ “मृत्यु ही इस दुनिया का अंतिम सच है!” पर ये बात मैं जीते जी कभी अपने जिगरी दोस्त #SatishKaushik के बारे में लिखूँगा, ये मैंने सपने में भी नहीं सोचा था।45 साल की दोस्ती पर ऐसे अचानक पूर्णविराम !! Life will NEVER be the same without you SATISH ! ओम् शांति! 💔💔💔 pic.twitter.com/WC5Yutwvqc
— Anupam Kher (@AnupamPKher) March 8, 2023