Gauri Khan: షారుక్ భార్య గౌరీ ఖాన్‌పై కేసు నమోదు
Gauri Khan: బాలీవుడ్ కింగ్ ఖాన్, బాద్షా షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్‌పై లఖ్నవులో చీటింగ్ కేసు నమోదైంది. ముంబయికి చెందిన వీరిపై ఫిర్యాదు చేశారు. తాజాగా బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ పారిశ్రామికవేత్తగా ,ఫ్యాషన్ డిజైనర్ గా గుర్తింపు తెచ్చుకున్న గౌరీ ఖాన్ పై ముంబైకి చెందిన పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసారు. సెక్షన్ 409 ఉల్లంఘన కేసు కింద గౌరీపై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తాజా సమాచారం.
గౌరీ ప్రచారకర్తగా ఉన్న కంపెనీ రూ. 86 లక్షలు వసూలు చేసినప్పటికీ తనకు ఫ్లాట్‌ను కేటాయించలేదని ఆరోపిస్తూ ముంబైకి చెందిన జస్వంత్ షా అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. లక్నోలోని సుశాంత్ గోల్ఫ్ సిటీ ప్రాంతంలోని తులసియాని గోల్ఫ్ వ్యూలో తనకు కేటాయించిన ఫ్లాట్‌ను వేరొకరికి ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 2015 లో ఫ్లాట్ కోసం రూ.85.46లక్షలు కట్టానని బాధితుడు చెప్పాడు. 2016 అక్టోబర్‌లో ప్లాటును రిజిస్ట్రేషన్ చేసి అప్పగిస్తామని కంపెనీ హామీ ఇచ్చిందని.. తర్వాత ప్లాటును అప్పగించనందుకు పరిహారంగా రూ.22.70లక్షలు చెల్లించి 6నెలల్లో ప్లాటును అప్పగిస్తామని చెప్పిందని తెలిపాడు. ఇప్పడు ఆ ప్లాట్ ను వేరొకరి పేరు మీద విక్రయించేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు బాధితుడు పోలీసులకు పిర్యాదు చేసాడు.