KalyanRam: ‘బింబిసారా’ ప్రతి ఒక్కరికి కొత్త అనుభూతినిస్తుంది కళ్యాణ్ రామ్
నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘బింబిసారా’. ఎన్నో అంచనాలతో రాబోతున్న ఈ సినిమాను దర్శకుడు వశిష్ఠ ఫాంటెసీ థ్రిల్లర్గా తెరకెక్కించాడు ఈ సినిమాలో హీరో కళ్యాణ్ రామ్ సరికొత్త లుక్తో కనిపిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్స్ ఇంకా అలాగే ట్రైలర్లు ఈ సినిమాపై ఎన్నో భారీ అంచనాలను అమాంతం పెంచేస్తున్నాయి.ఈ మద్యే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ తిరుపతి వెళ్లి స్వామి వారిని దర్శించుకుని మీడియా సమావేశం నిర్వహించారు.
హీరో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ: పాండమిక్ తర్వాత వరుసగా సినిమాలు విడుదలవుతున్నాయి.మా సినిమా కూడా ఈ ఆగస్టు 5 న వస్తుంది.ఇందులో క్యాథరిన్ పీరియాడిక్ టైమ్ లో కనిపిస్తుంది. తను ఈ చిత్రంలో ఐరా పాత్రలో నటిస్తుంది. అలాగే మరో హీరోయిన్ సంయుక్త వైజయంతి పాత్రలో నటిసున్నారు.అలాగే ప్రకాష్ రాజ్ ,అయ్యప్ప శర్మ ఈ సినిమాలో నటించారు. ఆగస్టు 5 న విడుదలవుతుంది.ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరు థియేటర్ లో ఒక కొత్త అనుభూతిని పొందుతారు.ఎన్టీఆర్ నటించిన యమదొంగ తర్వాత మళ్ళీ ఇన్నేళ్లకి సోసియో ఫాంటసీ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాము అని తెలిపాడు.
శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ : ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ నటవిశ్వరూపాన్ని చూడబోతున్నారు.ఇందులో నా పాత్ర పేరు జుబేదా.పటాస్ తరవాత కళ్యాణ్ గారితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీ గా ఉంది.వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందాము .ఇక ప్రేక్షకుల ఆశీస్సులు ఆగస్టు 5 వ తేదీన తప్పకుండా పొందుతాము అని వెల్లడించాడు.
దర్శకుడు వసిష్ఠ మాట్లాడుతూ : నేను ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాను .ఇంతపెద్ద ప్రాజెక్టును నమ్మి నాకు ఇచ్చినందుకు కళ్యాణ్ రామ్ గారికి ధన్యవాదాలు అలాగే ఈ చిత్రంలో నటించిన ప్రతిఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
చోటా కె నాయుడు మాట్లాడుతూ : ఈ సినిమాలో ఒక కొత్త కళ్యాణ్ రామ్ ను చూడబోతున్నారు. పౌరాణిక సినిమాలంటే గుర్తుకు వచ్చేది నందమూరి తారకరామా రావు ఆ తర్వాత ఇంత పెద్దెత్తున కళ్యాణ్ రామ్ మళ్ళీ అటువంటు సోసియో ఫాంటసీ సినిమా ‘బింబి సారా’ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తప్పకుండ విజయం సాదిస్తుందని తెలిపాడు.