Bichagadu2:విజయ్ ఆంటోని(Vijay Antony) నటించిన లేటెస్ట్ మూవీ `బిచ్చిగాడు 2`(Bichagadu2). 2016లో సైలెంట్‌గా విడుదలైన `బిచ్చగాడు`(Bichagadu) మూవీ ఏ స్థాయి సంచలనాలు సృష్టించిందో అందరికి తెలిసిందే.
Bichagadu2:విజయ్ ఆంటోని(Vijay Antony) నటించిన లేటెస్ట్ మూవీ `బిచ్చిగాడు 2`(Bichagadu2). 2016లో సైలెంట్‌గా విడుదలైన `బిచ్చగాడు`(Bichagadu) మూవీ ఏ స్థాయి సంచలనాలు సృష్టించిందో అందరికి తెలిసిందే. ఈ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని విజయ్ ఆంటోని తానే దర్శకుడిగా, నిర్మాతగా, మీరోగా, ఎడిటర్‌గా, సంగీత దర్శకుడిగా ఐదు శాఖలను నిర్వహించి రూపొందించిన మూవీ `బిచ్చగాడు 2`. రీసెంట్గా విడుదలై మిశ్రమ స్పందన సొంతం చేసుకున్న ఈ సినిమా వసూళ్ల పరంగా మాత్రం రికార్డులు సృష్టిస్తోంది.
టాక్‌కు రిజల్ట్కు సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మూడు రోజులకే తెలుగు రాష్ట్రాల్లో రూ. 10 కోట్లమేర వసూళ్లని రాబట్టి సంచలనం సృష్టిస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఊహించని విధింగా వసూళ్లని రాబడుతున్న ఈ సినిమా రానున్న రోజుల్లో మరింతగా వసూళ్లని రాబట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో వచ్చిన `బిచ్చగాడు` సంచలన విజయాన్ని సాధించడంతో `బిచ్చగాడు 2`పై సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలని రీచ్ కావడంతో కొంత విరకు `బిచ్చగాడు 2` విఫలమైనా మౌత్ టాక్ కారణంగా భారీ క్రేజ్ ని సొంతం చేసుకుంది.
Beggars Watched Bichagadu Pichaikkaran In Ac Theateracc
దీంతో ప్రేక్షకులు ఈ సినిమాపై ఆసక్తిని చూపిస్తున్నారు. ఇప్పటికే వర్లడ్ వైడ్‌గా 1500 పై చిలకు స్క్రీన్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ అదే క్రేజ్‌ని కంటిన్యూ చేస్తూ బాక్సాఫీస్ వద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే ఈ సినిమాని ప్రత్యేకంగా 150 మంది బిచ్చగాళ్లకు టీమ్ చూపించింది. చెన్నైలోని ఓ పాపులర్ థియేటర్లో 150 మంది బిచ్చగాళ్ల కోసం `బిచ్చగాడు 2` నిర్మాత విజయ్ ఆంటోని సతీమణి ఫాతిమా విజయ్ ప్రత్యేకంగా చూపించారు.
అంతే కాకుండా షో పూర్తయిన తరువాత బెగ్గర్స్ అందరికి బిర్యాని పెట్టించారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ విషయం తెలిసిన నెటిజన్లు హీరో విజయ్ ఆంటోనీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బెగ్గర్స్కి ప్రత్యేకంగా ఏసీ థియేటర్లో సినిమా చూపించడమే కాకుండా అందరికి బిర్యానీ పెట్టించి పంపించడం అభినందనీయమని ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
బిచ్చగాడు 3 మొదలయ్యేది అప్పుడే..
`బిచ్చగాడు 2`కు అనూహ్య ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో దీనికి సీక్వెల్‌పై హీరో, దర్శకుడు విజయ్ ఆంటోని స్పందించారు. `బిచ్చగాడు 2`కు కొనసాగింపుగా మూడవ భాగం కూడా వస్తుంది. అది పూర్తిగా విభిన్నమైన కథతో తెరకెక్కుతుంది. స్క్రిప్ట్‌ని సిద్ధం చేయడానికి ఏడాదికి పైనే సమయం పట్టవచ్చు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2025లో సినిమాను మొదలు పెడతా. `బిచ్చగాడు 3`కి కూడా నేనే దర్శకత్వం వహిస్తా` అని హీరో విజయ్ ఆంటోని తెలిపారు.