Bichagadu-2: ‘బిచ్చగాడు 2’ నుండి బికిలి సాంగ్ విడుదల
Bichagadu-2: నకిలీ, డాక్టర్ సలీమ్ చిత్రాలతో తమిళ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయ్ ఆంటోనీ.. బిచ్చగాడు మూవీతో తెలుగులోనూ స్టార్డమ్ తెచ్చుకున్నాడు. ఈ మూవీ అతనికి తెలుగులో తిరుగులేని మార్కెట్ ను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం బిచ్చగాడుకు సీక్వెల్ గా మరో సినిమాతో వస్తున్నాడు విజయ్. ఈ చిత్రాన్ని తనే నిర్మిస్తూ డైరెక్ట్ చేస్తున్నాడు. దర్శకత్వంతో పాటు సంగీతం, ఎడిటింగ్ బాధ్యతలు కూడా తనే నిర్వర్తిస్తున్నాడు.
బిచ్చగాడు విడుదలైన అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో రెండో భాగంపైనా భారీ అంచనాలుపెట్టుకున్నాడు విజయ్. అలాగే ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్ ఉన్నాయ్. అందరి అంచనాలను అందుకోవడానికి త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికైతే గతంలో విడుదలైన థీమ్ సాంగ్ అందరిని ఎంతగానో అలరించింది. ఇప్పుడు బిచ్చగాడు2 నుండి తాజాగా బికిలి అనే టైటిల్ సాంగ్ వొదిలారు మేకర్స్. ఈ బికిలి అనేపదం గురించి కొన్నాళ్లుగా చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. వారి కన్ఫ్యూజన్ ను క్లియర్ చేస్తూ.. బికిలీ అనే పదానికి అర్థం చెబుతూ.. ఈ మూవీ నుంచి లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాటని కంపోజ్ చేసి పాడటమే కాదు రాసింది కూడా విజయ్ ఆంటోనీయే.