‘భళా తందనానా’ రిలీజ్ డేట్ ఫిక్స్..
టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “భళా తందనానా”. బాణం మరియు బసంతి ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీవిష్ణు సరసన క్యాథరిన్ థెరిస్సా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా మేకర్స్ తమ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఏప్రిల్ 30 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. అయితే ఏప్రిల్ 29 న ఆచార్య సినిమా రిలీజ్ కానుంది. ఈ సమయంలో శ్రీవిష్ణు ఎందుకు దైర్యం చేశాడు అనేది హాట్ టాపిక్ గా మారింది.
చిరు, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సినిమా కావడం, ఇప్పటివరకు ఓటమి ఎరుగని దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించిన సినిమా కావడంతో ఆచార్యపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఏ తేదీ లేనట్లు ఆచార్య రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు. కథను నమ్మి సినిమా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించడం విశేషం. మరి ఆచార్యతో పోటీపడి శ్రీవిష్ణు నిలబడతాడా..? లేదా ? అని చూడాలి.