దసరాకు భగవంత్ కేసరి సినిమా థియేటర్లలోకి వస్తాదని మొదట నుంచీ అనుకుంటున్నా.. చంద్రబాబు అరెస్ట్‌తో రిలీజ్ డేట్ మారొచ్చనే వార్తలు వినిపించాయి.
Bhagavanth Kesari: నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna) – అనిల్ రావిపూడి(Anil ravipudi) కాంబోలో వస్తున్న చిత్రం భగవంత్ కేసరి(bhagavanth Kesari). షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ నటిస్తుండగా.. శ్రీ లీల ముఖ్య పాత్రలో నటిస్తుంది. ఇక ఈ సినిమా కోసం బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ను విలన్ గా దింపారు మేకర్స్. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్ ఏ రేంజ్ లో రచ్చ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇక ఆ మధ్య బాలయ్య బర్త్ డే(Happy Birthday NBK) సందర్భంగా అభిమానులకు మరో పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. భగవంత్ కేసరి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేసి బాలయ్య కు బర్త్ డే విషెస్ తెలిపారు. ఇది బాలయ్య 108వ సినిమా కావడంతో 108 థియేటర్స్ లో ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. థియేటర్స్ లో బాలయ్య అభిమానులు సందడి చేశారు. హైదరాబాద్ శ్రీ భ్రమరాంబ థియేటర్ లో నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి టీజర్ లాంచ్ ని చిత్రయూనిట్ లాంచ్ చేశారు.
ఇక ఫస్ట్ గ్లింప్స్ లో బాలయ్య ఊచకోత కనిపిస్తుంది. ఇక సినిమా థియేటర్లలోకి వస్తే.. తెలంగాణ యాసతో పాటు బాలయ్య హిందీ డైలాగ్స్ కు థియేటర్ లో మారుమ్రోగిపోతాయ్ అని చెప్పడంలో ఏటువంటి అతిశయోక్తి లేదు. ” రాజు .. వాని యేనక ఉన్న మందిని చూయిస్తాడు.. మొండోడు.. వానికి ఉన్న ఒకే ఒక గుండెను చూయిస్తాడు” అని బాలయ్య గుండె చూపించి విలన్స్ కు వార్నింగ్ ఇవ్వడం అదిరిపోయింది. ఇక హిందీ డైలాగ్స్.. నేలకొండ భగవత్ కేసరి.. ఈ పేరు చాలా యేండ్లు యాద్ ఉంటది అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ వీడియో మొత్తానికి హైలైట్ గా నిలిచింది.
నిజానికి దసరాకు భగవంత్ కేసరి సినిమా థియేటర్లలోకి వస్తాదని మొదట నుంచీ అనుకుంటున్నా.. చంద్రబాబు అరెస్ట్‌తో రిలీజ్ డేట్ మారొచ్చనే వార్తలు వినిపించాయి. కానీ దీనిపై మూవీ యూనిట్ ఈ రోజు క్లారిటీ ఇచ్చారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చెబుతూ.. అక్టోబర్ 19న ‘భగవంత్ కేసరి’ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. దీంతో గణేష్ చతుర్ధి పూట మంచి వార్తను చెప్పారంటూ బాలయ్య ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు.