Bettings on RRR Oscar award: ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ వస్తుందా? రాదా? జోరుగా బెట్టింగులు
Bettings on RRR Oscar Award Possibilities
దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ బరిలో నిలిచింది. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఖచ్చితంగా ఆస్కార్ దక్కించుకుంటుందని అనేక మంది అభిమానులు భావిస్తున్నారు. కొంత మంది ఏకంగా బెట్టింగులు చేస్తున్నారు.
కాదేదీ బెట్టింగులకు అనర్హం అనే విధంగా బెట్టింగు రాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు వస్తుందని కొందరు, రాదని కొందరు బెట్టింగులకు దిగుతున్నారు. ఈ వ్యవహారం లక్షల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
కోడి పందాలు, క్రికెట్ బెట్టింగులు మనకు సర్వసాధారణంగా తెలుసు. వీటితో పాటు ఓ సినిమాకు అవార్డు వస్తుందా రాదా అనే విషయంలో కూడా బెట్టింగులు జరుగుతుండడం ఇదే మొదటి కావచ్చని తెలుస్తోంది.
బెట్టింగులకు కేరాఫ్ అడ్రస్ అయిన భీమావరంలో ఈ బెట్టింగుల జోరు చాలా ఎక్కువుగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అదే విధంగా హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లోని ఓ దర్శకుడు, నిర్మాత మధ్య కూడా కోటి రూపాయల బెట్టింగ్ జరిగినట్లు కూడా తెలుస్తోంది.