The Elephant Whisperers: ఆస్కార్ అందుకున్న ఇండియన్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ ది ఎలిఫెంట్ విస్పరర్స్
The Elephant Whisperers: ఆస్కార్ అవార్డుల వేడుకలు మొదలయ్యాయి. 95వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సం షురూ అయ్యాయి. ఈ క్రమంలో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరిలో భారత్ కు ఆస్కార్ అవార్డు వచ్చింది. ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ కు షార్ట్ ఫిలిమ్ ఈ అవార్డు అందుకుంది. మహిళ డైరెక్టర్ కార్తీకి గోన్సాల్వేస్ ఈ మూవీని తెరకెక్కించారు. ఆస్కార్ వేడుకలో కార్తీకి ఈ అవార్డును సగర్వంగా అందుకున్నారు. షార్ట్ ఫిలిమ్ విభాగంలో భారత్ కు ఇదే తొలి ఆస్కార్ కావడం విశేషం.
ఈ చిత్రాన్ని కార్తిక్ గోన్సాల్వేస్, గునీత్ మొంగా రూపొందించారు. ముంబైకి చెందిన ప్రముఖ ఫోటోజర్నలిస్ట్ కార్తికీ గోన్సాల్వెస్ తెరకెక్కించిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ మూవీ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిమ్ కేటగిరీలో నామినేషన్ పొందింది. ఆస్కార్ వేదిక మీదకు చీరకట్టులో వెళ్లారు ఫిల్మ్ మేకర్ గునీత్ మోంగా. సంప్రదాయ దుస్తుల్లో అవార్డ్ అందుకున్నారు గునీత్ మోంగా.. డైరక్టర్ కార్తికీ గొన్సాల్వేస్ ఈ డాక్యురీమెంటరీ కోసం ఆమె ఐదేళ్లు కష్టపడ్డారు. తన బృందంతో కలిసి ఐదేళ్ల పాటు ఏనుగులతో జీవించారు.