Abhiroop Basu: చిన్న సినిమాగావచ్చి పెద్దవిజయం సొంతచేసుకున్న సినిమా ‘కాంతార’ ఇటీవల వచ్చిన కన్నడ సినిమా కాంతార కన్నడలోనే కాక తెలుగు, హిందీలో విడుదలై దేశమంతటా భారీ విజయం సాధించింది. రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా తెరకెక్కించిన ఈ సినిమా దాదాపు 150 కోట్ల కలెక్షలన్లని రాబట్టి భారీ విజయం సాధించింది. త్వరలో 200 కోట్ల క్లబ్ లోకి వెళ్లనుంది. సాధారణ ప్రేక్షకుల నుంచి స్టార్ సెలబ్రిటీల వరకు ఈ సినిమాని అందరూ పొగిడేస్తున్నారు. ఈమద్యే తమిళ సూపర్ స్టార్ రజిని కాంత్ ఈసినిమాను చూసి దర్శకుడిని ఇంటికి పిలిపించుకుని అభినందించాడు. దేశమంతటా ఈసినిమాను పొగుడుతుంటే ఓ బెంగాలీ డైరెక్టర్ ఈ సినిమాపై విమర్శలు చేశాడు.
అభిరూప్ బసు అనే బెంగాలీ డైరెక్టర్ తాజాగా ‘కాంతార’ సినిమాపై విమర్శలు చేశాడు. అసలు ఆ సినిమాలో ఏముందని జనాలు అంతగా ఎగబడుతున్నారు. ఆ సినిమా ఎలానచ్చింది అందరికి.. నాకైతే నచ్చలేదు. ఈ సినిమా ప్రజల తెలివితేటల్ని అపహాస్యం చేసింది. ట్విస్టులు కూడా సరిగ్గా లేవు. దేవున్ని నమ్మాలని ప్రజల మీద రుద్దినట్టు ఉంది .. అందరూ క్లైమాక్స్ గురించి గొప్పగా పొగుడుతున్నారు. క్లైమాక్స్ బోరింగ్ గా ఉంది అని అన్నాడు.
ఈ కామెంట్స్ పై నెటిజన్లు అభిరూప్ కి కౌంటర్లు ఇస్తున్నారు. నువ్వు అసలు డైరెక్టర్ అని కూడా ఎవరికీ తెలీదు. దమ్ముంటే ఇలాంటి ఒక సినిమా తీసి చూపించు అని కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.