Veera simhareddy: భ్రమరాంబ థియేటర్ లో బాలయ్య సందడి
Veera simhareddy: బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ ఈ రోజు గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద బాలయ్య అభిమానులు సందడి చేస్తున్నారు. ఉదయం కూకట్ పల్లిలోని భ్రమరాంబ థియేటర్లో బాలయ్య సందడి చేశారు. చిత్ర యూనిట్ తో కలిసి షో చూసేందుకు బాలయ్య థియేటర్ కు వచ్చారు. బాలయ్యకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.
బాలయ్య భ్రమరాంబ థియేటర్ కు వస్తున్నాడని తెలుసుకున్న అభిమానులు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఇక బాలయ్య థియేటర్లోకి ఎంట్రీ ఇవ్వగానే జై బాలయ్య అంటూ నినాదాలు చేసారు, ‘గాడ్ అఫ్ మాస్’ అంటూ ఫాన్స్ అరుపులు కేకలతో థియేటర్ దద్దరిల్లిపోయింది. థియేటర్ లో అభిమానుల మధ్య కూర్చుని హీరో బాలకృష్ణ, డైరెక్టర్ గోపిచంద్ మలినేని సినిమా చూశారు.
ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఇందులో బాలయ్య సరసన శృతిహాసన్ నటించింది.తమన్ మ్యూజిక్ అందించాడు. ఇప్పటికే పలు థియేటర్ల వద్దకి ఫాన్స్ సినిమాను చూడడానికి థియేటర్ల వద్దకు చేరుకుంటున్నారు.