Veera Simha Reddy: బాలయ్య సినిమాకు షాక్.. గంటల్లోనే HD ప్రింట్ బయటకు?
Veera Simha Reddy Piracy Leaked: నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం వీర సింహారెడ్డి సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అలా అయితే ఎన్నో అంచనాల నడుమ ఈరోజు అంటే జనవరి 12, 2023 న థియేటర్ లో విడుదలైంది వీర సింహారెడ్డి. మొదటి ఆట నుంచీ ఈ సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకున్నప్పటికీ పైరసీకి బలైపోయింది, విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ వీర సింహారెడ్డి సినిమా టెలిగ్రాం యాప్ సహా మూవీ రూల్స్, తమిళ్ మూవీస్, తమిళ్ రాకర్స్ వంటి వెబ్సైట్లలో దర్శనం ఇస్తోంది. అలా వీర సింహారెడ్డి చాలా మంచి టాక్ తో థియేటర్ లో దూసుకెళ్లడానికి సిద్దమైనా పైరసీని మాత్రం తప్పించుకోలేక పోయింది. ఈ విషయం తెలిసి అభిమానులు మేకర్స్ దృష్టికి తీసుకు వెళ్లడంతో సినిమా యూనిట్ అంతా ఈ లింకులు తీయించడానికి ప్రయత్నిస్తోందని అంటున్నారు. యాంటీ పైరసీ స్క్వాడ్ ను ఏర్పాటు చేసి సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయిన లింక్ లను డిజేబుల్ చేస్తున్నారని అంటున్నారు. అయితే ఈ పైరసీ ఎఫెక్ట్ వీర నరసింహారెడ్డి కలెక్షన్ల మీద =పడుతుందా..? లేదా..? అనేది మొదటి రోజు కలెక్షన్స్ బయటకు వస్తే కానీ తేలదనే చెప్పాలి.