Veera Simha Reddy: నా బాడీలాంగ్వేజ్‌కు తగ్గట్టు సినిమా ‘వీరసింహారెడ్డి’..బాలకృష్ణ
Balakrisna: తనదైన నటన శైలితో క్లాస్ -మాస్ ప్రేక్షకులను అలరిస్తూ.. సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో తన హవాను చాటుతున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. హిట్లు ఫ్లాపులను పట్టించుకోకుండా సినిమాలు చేసే ఆయన.. ‘అఖండ’ బ్లాక్ బస్టర్ తర్వాత సంక్రాంతి కి ‘వీర సింహా రెడ్డి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకు కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి జనాలు నీరాజనాలు పడుతున్నారు. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది.
బాలకృష్ణ మాట్లాడుతూ.. వీరసింహా రెడ్డి సినిమా కాదు.. ఓ ప్రయాణం. డైరెక్టర్ గోపీచంద్ మలినేని నా దగ్గకు వచ్చినప్పుడు ఎలాంటి కథ చేయాలా అని ఆలోచించాం. ముందు చెన్నకేశవ రెడ్డి అనగానే గోపీచంద్ మలినేని అర్థం కాలేదు. అప్పుడు సీమ రక్తం కుతకుతలాడుతుంది అని చెప్పగానే వెంటనే గోపీచంద్ చెన్నకేశవ రెడ్డి అన్నారు. అలా ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో సినిమాను తెరకెక్కించాం. అప్పుడే అన్నాను నిలోఉన్న టాలెంట్ మొత్తం ఈ సినిమాపై పెట్టమని అడిగా అన్నట్టుగానే ఆయన ఓ దర్శకుడిగా తనపని తాను చేసుకుంటూ ఓ అభిమానిగా ఎలా ప్రేక్షకులకు ఎలా చూపించాలో అని రెండుపాత్రల్లో సక్సెస్ అయాడు. ఏ విషయాన్నైనా నిజాయితీగా ధైర్యంగా చెప్పాలి గుండెల్లో దైర్యం ఉండాలి అలా ఉండాలంటే నాలా సింహంలా పుట్టాలి. ఈ సినిమాలో ఎదురులేని వీరసింహారెడ్డిని నేనే అని అన్నారు.
నా బాడీలాంగ్వేజ్‌కు తగ్గట్టు సినిమా ఇది చాలా పెద్ద విజయాన్ని సాధించింది. సాయి మాధవ్ బుర్రా, రామ జోగయ్య శాస్త్రి మంచి మాటలు, పాటలు రాశారు. నా అభిమానులు, తెలుగు ప్రేక్షకులకులతో పాటు ఇతర రాష్ట్రాల్లోని అభిమానులకు కూడా సినిమా నచ్చింది. అందరూ సినిమా బావుందని అంటున్నారు అన్నారు. ఈ సక్సెస్ మీట్‌లో మాతో పెట్టుకోకు సినిమాలోని మాఘమాసం లగ్గం పెట్టిస్తా అనే పాటను స్టేజ్‌పై సింగర్‌తో కలిసి పాడాడు బాలకృష్ణ. ఈ పాట బాలకృష్ణ పాడాలని సింగర్స్ కోరడంతో స్టేజ్‌పైకి వచ్చారు బాలకృష్ణ . వారితో కలిసి పాటను పాడి అభిమానులను అలరించారు. ఇక ఈ సక్సెస్ మీట్ లో చిత్రయూనిట్ తో పాటు దర్శకుడు హరీష్ శంకర్,యంగ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ పాల్గొన్నారు.
Moment of the day 🤩🤩
The GOD OF MASSES is entertaining the crowd with his singing 💥💥
Watch వీరసింహుని విజయోత్సవం Live Now!
– https://t.co/OYdts1a9tU#BlockBusterVeeraSimhaReddy
Natasimham #NandamuriBalakrishna @shrutihaasan @megopichand @MusicThaman @shreyasgroup pic.twitter.com/YDn6xxkTgw
— Mythri Movie Makers (@MythriOfficial) January 22, 2023