Veera Simha Reddy : మాస్ జాతర.. బాలయ్య మేనియా
VeerasimhaReddy: బాలయ్య అభిమానులకు సంక్రాంతి పండగ రెండురోజుల ముందే వచ్చేసింది. బాలయ్య నటించిన ‘ వీర సింహారెడ్డి’ సినిమా నెడు థియేటర్లలోకి వచ్చేసింది. రాత్రి నుండే అభిమానులు థియేటర్ల వద్ద టికెట్స్ కోసం భారీ క్యూ లైన్ ఏర్పడింది. ఇక బాలయ్య గతేడాది నటించిన అఖండ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా తర్వాత వస్తున్నా సినిమా కాబట్టి చిత్రం పై అభిమానులు అంచనాలు పిక్స్ స్టేజ్ కి చేరుకున్నాయి.
ఈ సినిమా భారీ స్థాయిలో నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ సినిమాలో బాలకృష్ణ లుక్ క్రేజీ గా ఉంది. ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఒకప్పటి ‘సమరసింహారెడ్డి’ ని గుర్తుకు తెస్తుంది. ఈ సినిమాని గోపిచంద్ మలినేని డైరెక్ట్ చేయగా మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిచారు. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ నటించింది.
ఇక బాలయ్య ఇందులో తండ్రీ కొడుకులుగా కనిపించిన తీరు ఫ్యాన్స్ ఉబ్బితబ్బిబై పోతున్నారు. ఏ పాత్రకు ఆ పాత్ర వెలివేషన్ స్క్రీన్ పై బాలయ్య స్క్రీన్ ప్రెజన్స్ ఫీస్ట్‌లా ఉందంటున్నారు. యూఎస్ లో ఎన్నడూ లేని విధంగా బాలయ్య సినిమాకు హైప్ వచ్చింది. ప్రీమియర్ బుకింగ్స్ తోనే వీరసింహారెడ్డి హాఫ్ మిలియన్ దాటేసింది. రాయలసీమ ఎపిసోడ్స్ లో బాలయ్య వీరసింహారెడ్డిగా ప్రత్యర్థి తో తలపడే సన్నివేశాలు సింహం వేటకెళితే ఎలాఉంటుందో అలా బాలయ్యను చూపించాడని మొదటి టాక్ వినపడుతుంది. బాలయ్య గవర్నమెంట్‌పై పేల్చే కొన్ని డైలాగ్స్ చెంపపెట్టులా ఉన్నాయని టాక్. సినిమా చూస్తున్న ఫాన్స్ మాత్రం జై బాలయ్య అంటూ మోత మోగిస్తున్నారు.