Balakrishna: వీరసింహారెడ్డి’కి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు
Balakrishna: నటసింహా నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన మాస్ ఎంటర్‌టైనర్ ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. శృతిహాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ నెల 12న విడుదలకానుండడంతో ఈ చిత్రంకోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ పనులు పూర్తిచేసుకుంది. వీరసింహారెడ్డికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ కేటాయించింది. ఇక ఈ మద్యే విడుదలైన ట్రైలర్ లో బాలకృష్ణ చెప్పిన డైలాగులు అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి.
గోపీచంద్ మలినేని ఈ మూవీకి దర్శకుడు కాగా వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్ర పోషించింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మించారు. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్రబృందం జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది. ఎస్ థమన్ మాస్-కంపోజిషన్లతో భారీ అంచనాలను నెలకొల్పాడు.