Nandamuri Balakrishna: కోట్లాది మంది అభిమానులను సంపాదించుకోవడం నా పూర్వజన్మ సుకృతం
Balakrishna Powerful Speech At Veera Simha Reddy Pre Release Event: నందమూరి నటసింహాం బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా గోపీచంద్ మలినేనిదర్శకత్వంలో తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ ‘వీరసింహారెడ్డి’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. మరో ఐదు రోజుల్లో థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రం ప్రచార కార్యక్రమాలను మేకర్స్ జోరుగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ప్రమోషన్స్ లో భాగంగా నేడు ఒంగోలు మార్కెట్ రోడ్ లోని అర్జున్ ఇన్ ఫ్రా గ్రౌండ్ లో గ్రాండ్ గా విజయవంతంగా కొనసాగింది. ఈ ఈవెంట్ లో బాలయ్య పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చాడు. “అందరికి నమస్కారం. నాకు ధన్యమైన జన్మనిచ్చి… మీ అందరి గుండెల్లో ఆయన ఆ మహానుభావుడి సరూపాన్ని కల్పించిన.. విశ్వానికే నట విశ్వరూపం అంటే ఏమిటో చూపించిన మహానుభావుడు, నా గురువు, నా తండ్రి, కారణజన్ముడు ఎన్టీఆర్‌కు మనస్పూర్తిగా నమస్కరిస్తున్నాను. నటనతో అందర్నీ మెప్పించిన అలాంటి వ్యక్తి ఎక్కడా లేరు అని ఏ నటుడైనా ఒప్పుకోవాల్సిందే” అని ఎన్టీఆర్ నుగుర్తుచేశాడు.
ఇక సినిమా గురించి బాలయ్య మాట్లాడుతూ.. ” వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎవరిని ఆహ్వానించాలనే విషయం చర్చకు వచ్చినప్పుడు.. ఈ వేదికను శాసించే వ్యక్తి ఎవరు లేరు. ఈ వేదికను ఎక్కే వ్యక్తి ఎవడు లేడు. ఈ వేదికను పెద్దరికంతో అలరించే ఆ అర్హత ఉన్న వ్యక్తి కేవలం బీ గోపాల్ మాత్రమే. అందుకే గోపాల్ గారినే పిలిచాం అని బాలయ్య అన్నారు. గత జన్మలో చేసిన మంచి పనులకు ఈ జీవితంలో ఒకరిని సంపాదించుకొవచ్చు అంటారు. కానీ నేను కోట్లాది మందిని సంపాదించుకోవడం నా పూర్వజన్మ సుకృతం. వారితో నా జన్మజన్మల బంధం, డబ్బుతో కొనలేనిది అభిమానం. వీరసింహారెడ్డి చిత్రానికి దర్శకుడు ఒంగోలు వాసి మలినేని గోపిచంద్. ఆయన నా అభిమాని. నా సినిమాలు చూడటానికి ఎన్నో దెబ్బలు తిన్నారు. అలాంటి వ్యక్తి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆయన ఒంగోలు గిత్త లాంటి వాడు. నా తదుపరి సినిమాకు కూడా ఒంగోలు వాసి అనిల్ రావిపూడి దర్శకత్వ వహిస్తున్నారు.
నేను రాయలసీమకే పరిమితం అవతానని అనుకొంటారు. కానీ నేను తెలంగాణ, ఆంధ్రాలో కూడా బొబ్బిలిసింహాన్ని. రోషానికి ప్రతీకనై ఉన్నానని చెప్పే రెడ్డిని, నాయుడిని నేనే” అని చెప్పుకొచ్చారు. ఇక చివర్లో బాలయ్య సినిమాల్లోకి రాడు.. రాజకీయాలకే పరిమితం అంటూ గతంలో వచ్చిన ఆరోపణలను గుర్తు చేశారు. వాటికి సమాధానంగా ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ వచ్చిన విషయం తెలిసిందేగా అన్నారు. ప్రస్తుతం టాక్ షోలలో టాప్ లో ఉందని చెప్పారు. రీసెంట్ గా ‘అఖండ’.. ఇప్పుడు ‘వీరసింహారెడ్డి’తో థియేటర్లు దద్దరిల్లుతాయని తెలిపాడు. సినిమా మొత్తం ఫ్యాన్స్ కు పూనకాలే అని తెలిపిన బాలయ్య అభిమానులను జాగ్రత్తగా ఇంటికి వెళ్ళమని చెప్పి స్పీచ్ ను ముగించాడు.