Veera Simha Reddy: జగన్ పై బాలయ్య పరోక్షంగా పంచ్ లు..
Balakrishna: నందమూరి నరసింహ బాలకృష్ణ నటించిన లేటెస్ట్ చిత్రం వీర సింహారెడ్డి.. ఈ సినిమా జనవరి 12న థియేటర్స్ లో విడుదల కానుంది. నిన్న ‘వీర సింహా రెడ్డి’ ట్రైలర్ వచ్చేసింది. ఆ ట్రైలర్ బాలయ్య అభిమానులకు తెగ నచ్చేసింది. అలాగే.. టీడీపీ శ్రేణులకు కూడా ఈ ట్రైలర్ లో ఉన్న డైలాగ్స్ అదరగొడుతున్నాయని అంటున్నారు. బాలకృష్ణ సినిమా అంటే… పొలిటికల్ పంచ్‌లు లేకపోతే ఎలా? సింహా, లెజెండ్ లో… పొలిటికల్ డైలాగులు థియేటర్లో ఓ మోత మోగించాయి.
ఇక ఈ సినిమాలో కూడ పొలిటికల్ పంచ్‌లు ఉన్నట్లు చెప్పకనే చెప్పారు. బాలయ్య ఈ సినిమా లో పొలిటికల్ పంచ్ వేయడానికి ఫుల్ ప్రిపేర్ అయ్యారనే తెలుస్తుంది. నిన్న విడుదలైన ట్రైలర్ లో సీఎం జగన్ పై పరోక్షంగా వేసిన పంచ్ లు..ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ మధ్య జగన్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చి మాజీ ముఖ్యమంత్రి దివంగత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడం దానికి టీడీపీ కౌంటర్ ఇవ్వడం దర్నాలు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రైలర్ లో బాలయ్య ‘సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు,మార్చలేరు.’ అనే డైలాగ్ తో పరోక్షంగానే జగన్ పై పంచ్ వేశాడు.
మరి ఈ ‘సినిమాలో బాలయ్యే ఈ డైలాగులు పెట్టించుకున్నాడా ? లేదా దర్శకుడు గోపీచంద్, ఈ డైలాగులు కావాలనే చెప్పించడం అన్నది తెలియాలి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్స్ లో విడుదల అవుతుంది. ఇందులో బాలయ్య సరసన శృతి హాసన్ నటించింది.