Balakrishna: ‘NBK 107’ షూటింగ్ లో అడుగుపెట్టిన నటసింహం
Balakrishna NBK 107:నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘NBK107’ అనే వర్కింగ్ టైటిల్ తో శెరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఇటీవల బాలయ్య బాబు కరోనా బారిన పడటంతో పాటు ఈ సినిమా యూనిట్ సభ్యులు కూడా కరోనా బారిన పడటంతో సినిమాకి బ్రేక్ పడింది. దీంతో దసరాకి విడుదల కావలిసిన ఈ చిత్రం డిసెంబర్ కి పోస్ట్ ఫోన్ అయిందని సమాచారం.
సినిమా టైటిల్ ను ఒక మంచి ముహూర్తాన రివీల్ చేయాలనీ మేకర్స్ కి బాలకృష్ణ సూచించాడని సమాచారం.బ్లాక్ బస్టర్ సినిమాలు తీస్తున్న గోపీచంద్ మలినేని ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమానుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ , ఫస్ట్ గ్లిమ్స్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఈ షూటింగ్ కి కొన్ని రోజులు బ్రేక్ పడింది.ఇన్ని రోజుల తర్వాత బాలయ్య ‘NBK 107’ షూటింగ్ సెట్ లోకి ఎంట్రీఇచ్చాడు.ఏది ఏమైనా అక్టోబర్ లో సినిమా కంప్లీట్ చేసి డిసెంబర్ లో అది కూడా ‘అఖండ’ రిలీజ్ అయిన తేదీ నాడు.. ఈ సినిమా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.