Balakrishna : అక్కినేని తొక్కినేని వివాదం తరువాత మొదటి సారి పబ్లిక్ లోకి బాలయ్య?
Balakrishna Public Appearance: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో గురువారం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పలు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ముందుగా హిందూపురం నేత అంబికా లక్ష్మీనారాయణ కుమార్తె వివాహానానికి హాజరు కానున్న బాలకృష్ణ ఆ తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సైతం పాల్గొననున్నారు. అయితే బాలకృష్ణ “ఇదేం కర్మ” రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ఆ కార్యక్రమం కోసం అనుమతులు అడిగితే పోలీసుల నుంచి స్పందన లేదని టీడీపీ నాయకులు ఆరోపించారు. పోలీసులకు దరఖాస్తు చేసుకున్నా.. ఇంత వరకూ రియాక్ట్ కావడంలేదంటూ మీడియా ముఖంగా పేర్కొనడంతో హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ నిర్వహించనున్న ‘ఇదేం ఖర్మ’కు పోలీసులు అనుమతి ఇచ్చారు. ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని సూచించారు. హిందూపురంలో రేపు టీడీపీ ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమం జరపనుంది. కార్యక్రమ నిర్వహణకు గతంలో దరఖాస్తు చేసుకున్నా పోలీసులు ఇప్పటివరకు నిర్ణయం తీసుకోకపోవటంతో అసలు జరుగుతుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. అయితే ఎట్టకేలకు అనుమతి రావడంతో ఆ పార్టీ కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. రాకపోకలకు ఇబ్బంది కలక్కుండా.. నిరసన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని పోలీసులు తెలుపడంతో పాటు రహదారిపై సభలు, సమావేశాలకు అనుమతి మాత్రం ఇవ్వలేమని చెప్పారు అయితే రాకపోకలకు ఇబ్బంది లేకుండా నిరసన కార్యక్రమాలు మాత్రం నిర్వహించుకోవచ్చని తెలిపారు. అయితే ఆ రంగారావు ఈ రంగారావు, అక్కినేని – తొక్కినేని కామెంట్లు వివాదంగా మారిన తరువాత మొదటి సారిగా పబ్లిక్ లో బాలయ్య కనిపించనున్నారు. ఈరోజు సాయంత్రం లోపు క్షమాపణలు చెప్పకుంటే ఆందోళనకు దిగుతామని అక్కినేని అభిమానులు, కాపునాడు నేతలు హెచ్చరించిన నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది.