బాలకృష్ణ 29 ఏళ్ల కిందట నటించిన ‘ భైరవ ద్వీపం’ సినిమాను మళ్లీ 4K క్వాలిటీతో రీరిలీజ్ కి ప్లాన్ చేశారు.అనుకున్నట్లే జరిగితే ఈ రోజు థియేటర్లలో బాలయ్య అభిమానుల సందడి కనిపించేది.కానీ ఆశించిన స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ లేకపోవడంతో సినిమా రీరిలీజ్‌ను ..ఏకంగా నవంబర్‌కు వాయిదా వేశారు.
Bhairava Dweepam:నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna) 29 ఏళ్ల కిందట నటించిన ‘ భైరవ ద్వీపం’(Bhairava Dweepam) సినిమాను మళ్లీ 4K క్వాలిటీతో రీరిలీజ్ కి ప్లాన్ చేశారు.అనుకున్నట్లే జరిగితే ఈ రోజు థియేటర్లలో బాలయ్య అభిమానుల సందడి కనిపించేది.కానీ ఆశించిన స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ లేకపోవడంతో సినిమా రీరిలీజ్‌ను ..ఏకంగా నవంబర్‌కు వాయిదా వేశారు. అడ్వాన్స్ బుకింగ్స్ చాలా దారుణంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఇక క్లాప్స్ ఇన్ఫోటైన్మెంట్ కు చెందిన చంద్రశేఖర్ కుమారస్వామి, దేవ్ వర్మ నవంబర్‌లో బైరవద్వీపాన్ని రీరిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ కొత్త డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు.
టాలీవుడ్ లో 4 కె రీమాస్టర్ ట్రెండ్ నడుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu) నటించిన ఇండస్ట్రీ హిట్ `పోకిరి`(Pokiri) తో మొదలైన ఈ ట్రెండ్ నాన్ స్టాప్‌గా సాగుతోంది. ఇప్పటి వరకు మహేష్ బాబు నటించిన ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్స్ తో పాటు పవన్ కల్యాణ్ క్లాసిక్ మూవీస్, ప్రభాస్ చిత్రాలు రీమాస్టర్ చేసి రీ రిలీజ్ అయ్యాయి. అయితే అందులో అత్యధిక శాతం వసూళ్లని రాబట్టింది మాత్రం మహేష్, పవన్ సినిమాలే. ఆ తరువాత నందమూరి బాలకృష్ణ నటించిన `చెన్నకేశవరెడ్డి` వంటి సినిమాలు రీ రీలీజ్ కావడం తెలిసిందే. ఇక సూపర్ స్టార్ కృష్ణ నటించిన `మోసగాళ్లకు మోసగాడు` మూవీని 8కెలోకి రీమాస్టర్ చేసి రిలీజ్ చేశారు.
ఇదే బాటలో టాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో ఒకరైన నందమూరి బాలకృష్ణ నటించిన జానపది చిత్రం `భైరవద్వీపం` కూడా 4కెలో రాబోతోందని ఫ్యాన్స్ ఆశ పడ్డారు. కానీ నవంబర్‌కు వాయిదా పడింది. ఇండస్ట్రీలో ఉన్న హీరోల్లో జానపద, పౌరాణిక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు నందమూరి బాలకృష్ణ. తండ్రి వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న ఆయన 1996లో తొలి సారి నటించిన సినిమా ఇది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో చందమామ విజయా కంబైన్స్ పై బి.వి.రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. రోజా హీరోయిన్గా, రంభ ప్రత్యేక పాటలో నటించిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.