OSCARS 2023 Avatar The Way Of Water : బెస్ట్ విజువల్ ఎఫెక్ట్ అవార్డు దక్కించుకున్న ‘అవతార్ ది వే ఆఫ్ వాటర్”
OSCARS 2023 Avatar The Way Of Water : హాలీవుడ్ సినిమా అవతార్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు. దర్శకుడు జేమ్స్ కామెరాన్ తన దర్శకత్వ ప్రతిభతో పండోరా అంటూ కొత్త ప్రపంచమే చూపించారు. 2009లో వచ్చిన ఈ గొప్ప విజువల్ వండర్ ‘అవతార్’కు సీక్వెల్‌గా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘అవతార్ ది వే ఆఫ్ వాటర్’ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ప్రభంజనం సృష్టించింది.
2009లో వచ్చిన ఈ సినిమా మూడు ఆస్కార్ అవార్డులను అందుకుంది. అందులో బెస్ట్ ఆర్ట్ డైరెక్షన్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ లో ఆస్కార్ గెలుచుకుంది. తాజాగా మరోసారి ఆస్కార్ ను అందుకుంది. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో అవతార్.. ది వే ఆఫ్ వాటర్ చిత్రం ఆస్కార్ గెలుచుకుంది. ఈ విభాగంలో ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్, ది బ్యాట్‌మ్యాన్, బ్లాక్ పాంథర్ వకాండ ఫరెవర్, టాప్ గన్ మావెరిక్ చిత్రాలు పోటీ పడ్డాయి. వీటిని దాటుకుని అవతార్.. ది వే ఆఫ్ వాటర్ బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో అవార్డును అందుకుంది. మొదటి భాగంతో పోల్చితే, ఆ రేంజ్‌లో రెండవ భాగం లేదనే విమర్శలెదుర్కొంది..అయినా కూడా బెస్ట్ బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ లో ఆస్కార్ ను సొంతం చేసుకుంది.
Congratulations to Joe Letteri, Richard Baneham, Eric Saindon and Daniel Barrett for their Academy Award win for Best Visual Effects for #AvatarTheWayofWater! #Oscars95 pic.twitter.com/WM9rK2auxw
— Avatar (@officialavatar) March 13, 2023