Raja Mouli: RRR సినిమాను రెండుసార్లు చూసిన జేమ్స్ కెమరున్
Avatar Director James Cameron watched RRR Movie twice
RRR సినిమాతో దర్శకుడు రాజమౌళి కెరీర్ గ్రాఫ్ మరింత పెరిగింది. ప్రపంచ వ్యాప్త గుర్తింపు లభిస్తోంది. అనేక అంతర్జాతీయ అవార్డులు లభిస్తున్నారు. విమర్శకలు ప్రశంసలు సైతం అందుతున్నాయి. ఈ నేపథ్యంలో అనుకోని సంఘటనలు కూడా జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ ను రాజమౌళి కలిశారు. దేవుడిని కలిశానని ట్వీట్ చేశారు.
రాజమౌళి తాజాగా అవతార్ దర్శకుడు జేమ్స్ కెమరున్ ను కలిశారు. ఆ సందర్భంగా దిగిన ఫోటోలను ట్వీట్ చేశాడు. జేమ్స్ కెమరున్ RRR సినిమా చూశారని, తనకు చాలా బాగా నచ్చడంతో తన భార్య సుజీతో కలిసి రెండోసారి కూడా సినిమా చూశారని రాజమౌళి ట్వీట్ చేశారు.
భార్యతో కలిసి RRR సినిమాను చూసిన జేమ్స్ కెమరున్ ఆ విషయాన్ని రాజమౌళితో పంచుకున్నారు. 10 నిమిషాల పాటు సినిమా గురించి రాజమౌళితో ముచ్చటించారు. అలా ఓ 10 నిమిషాల పాటు మాట్లాడడాన్ని తాను ఇంకా నమ్మలేకపోతున్నానని రాజమౌళి ట్వీట్ చేశారు.