Atlee Jawan:బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కథానాయకుడిగా నటించిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ `జవాన్`. అట్లీ దర్శకత్వంలో రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై షారుక్ వైఫ్ గౌరీఖాన్ అత్యంత భారీ స్థాయిలో నిర్మించారు.
Atlee Jawan:బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కథానాయకుడిగా నటించిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ `జవాన్`. అట్లీ దర్శకత్వంలో రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై షారుక్ వైఫ్ గౌరీఖాన్ అత్యంత భారీ స్థాయిలో నిర్మించారు. నయనతారహీరోయిన్గా బాలీవుడ్‌కు పరిచయమైన ఈ సినిమాలో దీపికా పదుకోన్, సంజయ్‌దత్ అతిథి పాత్రల్లో నటించారు. విజయ్ సేతుపతి పవర్ ఫుల్ విలన్‌గా నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 7న అత్యంత భారీ స్థాయిలో విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.
Jawan
తొలి రోజు రికార్డు స్థాయి ఓపెనింగ్స్‌ని రాబట్టిన జవాన్ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు రూ.800 కోట్లకు మించి వసూళ్లని రాబట్టినట్టుగా తెలుస్తోంది. ఇక దేశ వ్యాప్తంగా ఇందులో రూ.500 కోట్ల మేర వసూళ్లని దక్కించుకున్నట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే దర్శకుడు అట్లీ తన మనసులో మాట బయటపెట్టారు. ఓ మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చిన అట్లీ `జవాన్`పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.`ఓ సినిమా వెనుకు ఎంతో మంది శ్రమ ఉంటుంది. అలా కష్టపడి పని చేసిన ప్రతి దర్శకుడు, టెక్నీషియన్స్, నటీనటులు..సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరూ దాసికి అవార్డులు రావాలనే కోరుకుంటారు.
గోల్డెన్ గ్లోబ్, నేషనల్ అవార్డ్, ఆస్కార్..ఇలా ఏ పురస్కారం వచ్చినా సంతోషిస్తారు. నాకు `జవాన్`ను ఆస్కార్‌కు తీసుకెళ్లాలనే కోరిక ఉంది. ఈ విషయంపై షారుక్‌తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా. ఈ ఇంటర్వ్యూ షారుక్ చూస్తుంటారని ఆశిస్తున్నా. `సర్ మనం `జవాన్`ని ఆస్కార్‌కు తీసుకెళ్దామా? అని అడుగుతా` అంటూ అట్లీ `జవాన్`ను ఆస్కార్‌కు తీసుకెళ్లాలనే కోరికను బయటపెట్టారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.