Natu Natu Song: సత్తాచాటిన ‘నాటు నాటు’ కు ప్రశంసలవెల్లువ
Natu Natu Song: ఆస్కార్ అవార్జుల వేడుక అత్యంత ఘనంగా సాగుతోంది. ఓ వైపు ఇండియాకు తొలి ఆస్కార్ దక్కింది. మరోవైపు ఇండియన్ సినిమా నాటు నాటు పాట ఆస్కార్ వేదికను హోరెత్తించేసింది. అందరి అంచనాల్ని చేరుకుంటూ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగరీలో అవార్డు ను సొంతం చేసుకుంది. ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ పాటను ఆస్కార్ వారించడంతో దేశం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది.
ప్రపంచ పుటల్లో నాటు నాటు పాటకు అరుదైన గౌరవం లభించింది. ఇక రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ నాటు నాటు పాట లైవ్ ప్రదర్శన అత్యద్భుతంగా సాగింది. డాల్బీ ధియేటర్ అంతా చప్పట్లతో మార్మోగిపోయింది..అంతేకాదు ఈపాటకు అమెరికన్స్ కూడా సీట్లోంచి లేచి మరి డాన్స్ వేశారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డ్స్ అందుకున్నారు. ఇప్పటికే ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులు గెలుచుకున్న నాటు నాటు పాటకు ఇప్పుడు ఆస్కార్ రావడంతో భారతీయ సినీ ప్రేక్షకుల ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. ఇటీవలే అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డును నాటు నాటు పాట గెలుచుకుంది. ఆ అవార్డు గెలుచుకున్న తొలి ఆసియా పాట ఇదే కావడం విశేషం. ఈ పాటకు ఇంతగొప్ప గౌరవం దక్కించుకున్న ఈ టీమ్ కు దేశం మొత్తం సినీవర్గాల వారే కాకుండా రాజకీయనాయకులుకూడా అభినందనలు తెలుపుతున్నారు. చిరంజీవి , పవన్ కళ్యాణ్, చంద్రబాబు , మురళీమోహన్ వంటి వారే కాకుండా సోషల్ మీడియాలో ఈ టీమ్ కు ప్రశంసల వెల్లువెత్తుతోంది. దేశప్రధాని నరేంద్రమోడీ ఈ ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కు అభినందనలు తెలిపారు. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచస్థాయిలో నిలబెట్టిన ఈ చిత్రానికి ప్రధాని అభినందనలు తెలిపారు.
Exceptional!
The popularity of ‘Naatu Naatu’ is global. It will be a song that will be remembered for years to come. Congratulations to @mmkeeravaani, @boselyricist and the entire team for this prestigious honour.
India is elated and proud. #Oscars https://t.co/cANG5wHROt
— Narendra Modi (@narendramodi) March 13, 2023
‘Naatu Naatu’ has sealed its place in history by winning the Academy Award for Best Original Song at the #Oscars. This is probably the finest moment for Indian Cinema and Telugus achieving it is even more special.(1/2) pic.twitter.com/BAKVLsPVxf
— N Chandrababu Naidu (@ncbn) March 13, 2023
భారతీయులు గర్విస్తున్న క్షణాలివి
‘ఆర్.ఆర్.ఆర్.’ @RRRMovie చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు – JanaSena Chief Shri @PawanKalyan@ssrajamouli @mmkeeravaani @boselyricist @Rahulsipligunj @kaalabhairava7 @AlwaysRamCharan @tarak9999#Oscars #AcademyAwards #NaatuNaatu pic.twitter.com/zYcWxNFbHP
— JanaSena Party (@JanaSenaParty) March 13, 2023
#Oscars would have still been a dream for India but for One Man’s vision, courage & conviction @ssrajamouli ! 🫡🫡👏👏
A Billion 🇮🇳 Hearts filled with Pride & Gratitude ! Kudos to every member of the Brilliant Team of @RRRMovie@DVVmovies
#Oscars95— Chiranjeevi Konidela (@KChiruTweets) March 13, 2023