Ticket Hikes: వీరసింహారెడ్డి- వాల్తేరు వీరయ్య టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్…
AP Govt Permits Ticket Hikes for Veera Simha Reddy and Waltair Veeryya Movies: సంక్రాంతి రేసులో నిలిచిన ఇద్దరు అగ్ర హీరోల సినిమాల టికెట్ ధరల పెంపుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నందమూరి బాలయ్య హీరోనా నటించిన వీరసింహా రెడ్డి సినిమా రేపు విడుదల కానుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య 13న విడుదలకు సిద్దమవుతోంది. ఈ రెండు సినిమాల పైన అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రెండు సినిమాలను ఒకే బ్యానర్ లో నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. సంక్రాంతి వేళ పోటా పోటీగా వస్తున్న ఈ రెండు సినిమాలపైన అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
సినీ మేకర్స్ ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి ఈ రెండు సినిమాకు సంబంధించి రూ 50 వరకు పెంచుకొనే వెసులుబాటు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ఏపీ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం తీసుకొచ్చిన జీవో మేరకు సినిమా నిర్మాణ ఖర్చులను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. వాటిని పరిశలించిన తరువాత టికెట్ల ధరల పెంపు పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అందులో భాగంగా ఇప్పుడు వాల్తేరు వీరయ్య కు రూ 25, వీరసింహారెడ్డి సినిమా కు రూ 20 చొప్పున పెంచుకొనేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
సినిమా విడుదల నుంచి పది రోజుల పాటు అన్ని కేటగిరీల్లోన ఈ పెంపు వర్తించే విధంగా అనుమతి మంజూరు చేసింది. గతంలోనూ ఏపీ ప్రభుత్వం ఆర్ఆర్ఆర్ కు రూ 70, ఆచార్య కు రూ 50, సర్కారు వారి పాటకు రూ 45 చొప్పున పెంచుకొనేందుకు వెసులుబాటు ఇచ్చింది. ఇటు తెలంగాణలో ఇప్పటికే చిరు – బాలయ్య కొత్త సినిమాలకు ప్రత్యేక షోల నిర్వహణకు వీలుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విడుదల తేదీ నుంచి రోజుకు ఆరు షోల ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పుడు మెగా – నందమూరి ఫ్యాన్స్ లో ఈ రెండు సినిమాల జోష్ తో ముందుగానే సంక్రాంతి సందడి మొదలైంది.