Beautiful Girl: అనుపమ పరమేశ్వరన్ విడుదలచేసిన ‘బ్యూటీఫుల్ గర్ల్’ ఫస్ట్ లుక్
Beautiful Girl First Look Launch: మంత్ర,బటర్ ఫ్లై చిత్రాలు తీసి ఎంతో మంచిపేరు తెచ్చుకున్న జన్ నెక్స్ట్ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన తాజా చిత్రం ‘ది స్టోరీ అఫ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్’ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న సందర్బంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లో ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ‘బ్యూటిఫుల్ గర్ల్’ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.
అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. మొదటి సారిగా ‘బ్యూటిఫుల్ గర్ల్’ సినిమా ఫస్ట్ లుక్ విడియో పోస్టర్ ను లాంచ్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది.ఈ బ్యానర్ లో నేను ‘బటర్ ఫ్లై’ సినిమాలో నటించాను. ఇది నాకు మంచి పేరు తీసుకువస్తుంది. ఈ సినిమా త్వరలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మీరందరూ చూడవచ్చు. ‘బ్యూటిఫుల్ గర్ల్’ సినిమా ఫస్ట్ లుక్ బాగుంది. ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.
హీరో నిహాల్ మాట్లాడుతూ.. అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ‘మంత్ర’ వంటి కల్ట్ ఫిల్మ్ తీసిన తరువాత మంచి కథతో తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా అందరికి కచ్చితంగా నచ్చుతుంది.అని అన్నాడు.
హీరోయిన్ దృశిక మాట్లాడుతూ.. ఈ సినిమాలో వర్క్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.దర్శక,నిర్మాతలు బాగా సపోర్ట్ చేశారు.టీం అంతా కలసి హ్యాపీ గా ఎంజాయ్ చేస్తూనే సినిమాను పూర్తి చేశాము.ఈ చిత్ర ఫస్ట్ లుక్ లాంచింగ్ కి టాప్ హీరోయిన్ అనుపమ రావడం చాల ఆనందంగా ఉంది.