Anni Manchi Shakunamule Review:నటీనటులు:సంతోష్ శోభన్, మాళవికా నాయర్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, వెన్నెల కిషోర్, షావుకారు జానకి, ఊర్వశి, వాసుకి, రమ్యసుబ్రహ్మణ్యం, అంజు అల్వనాయక్, అశ్విన్‌కుమార్ లక్ష్మికాంతన్ తదితరులు నటించారు.
Anni Manchi Shakunamule Review:నటీనటులు:సంతోష్ శోభన్, మాళవికా నాయర్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, వెన్నెల కిషోర్, షావుకారు జానకి, ఊర్వశి, వాసుకి, రమ్యసుబ్రహ్మణ్యం, అంజు అల్వనాయక్, అశ్విన్‌కుమార్ లక్ష్మికాంతన్ తదితరులు నటించారు.
సంగీతం:మిక్కీ జె.మేయర్
సినిమాటోగ్రఫీ:సన్నీ కూరపాటి, రిచర్డ్ ప్రసాద్
ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖీ
సంభాషణలు:లక్ష్మీ భూపాల
స్క్రీన్‌ప్లే: షేక్ దావూద్
నిర్మాత: ప్రియాంక దత్
దర్శకత్వం:బి.వి.నందినిరెడ్డి
వరుస సినిమాల్లో నటిస్తున్న సంతోష్ శోభన్ టాలెంట్‌కు తగ్గ హిట్ లభించడం లేదు. ఈ సారి ఎలాగైనా సక్సెస్‌ని సొంతం చేసుకోవాలని `అన్నీ మంచి శకునములే` వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. నందినిరెడ్డి దర్శకత్వం వహించారు. తనకు కూడా ఈ సినిమా అత్యంత కీలకంగా మారింది. హీరోగా సంతోష్ శోభన్‌కు, దర్శకురాలిగా నందిరెడ్డిల కెరీర్‌కు కీలకంగా నిలిచిన `అన్నీ మంచి శకునములే` గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి వారు ఆశించిన ఫలితాన్నే రాబట్టిందా?..లేదా అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథేంటీ:
విక్టోరియా పురంలో అనే ఊరిలో జరిగే కథ ఇది. అందులో కె.జి. కాఫీ ఎస్టేట్‌కు.. అక్కడ తయారయ్యే కాఫీ పొడికి ప్రత్యేకమైన ఖ్యాతి ఉంది. అయితే ఆ కాఫీ ఎస్టేట్ విషయమై ప్రసాద్ (రాజేంద్రప్రసాద్), దివాకర్ (రావు రమేష్) కుటుంబాల మధ్య దశాబ్దాలుగా కోర్టు కేసు నడుస్తూ ఉంటుంది. ఆ కేసు విషయంలో రాజీ పడమని న్యాయమూర్తులు వాళ్లిద్దరికి నచ్చజెప్పినా ఎవరూ వెనక్కి తగ్గరు. దాంతో కేసు డైలీ సీరియల్‌గా సాగుతూనే ఉంటుంది. దివాకర్ తమ్ముడు సుధాకర్ (నరేష్) కొడుకు రిషి (సంతోష్ శోభన్.. ప్రసాద్ కూతురు ఆర్య (మాళవిక నాయర్) ఒకేరోజు ఒకే ఆసుపత్రిలో జన్మిస్తారు. అయితే ఆసుపత్రి సిబ్బంది చేసిన పొరపాటు వల్ల ఇద్దరు తారుమారవుతారు. ప్రసాద్ కొడుకుగా రిషి, సుధాకర్ కూతురిగా ఆర్య పెరిగి పెద్దవుతారు. చదువుకునే రోజుల్లో ఆర్యపై రిషి మనసు పారేసుకుంటాడు. ఈ ఇద్దరు కాఫీ ఎస్టేట్ పని మీద యూరప్ వెళతారు. అక్కడ ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో దూరం పెరుగుతుంది. ఇంతకీ ఈ ఇద్దరు ఒక్కటయ్యారా?..వాళ్ల పుట్టుక రషమ్యం ఎలా తెలిసింది?..చివరికి వీరి కథ ఎలా సుఖాంతమైంది అన్నదే ఈ చిత్ర ప్రధాన కథ.
నటీనటుల నటన:
నటుడిగా హీరో సంతోష్ శోభన్‌ను మరో మెట్టు పూఐకి ఎక్కించే సినిమా ఇది. రిషి పాత్రను మంచి ఈజ్‌తో పోషించాడు. పతాక ఘట్టాల్లో భావోద్వేగమైన నటనతో మనసుల్ని పిండేస్తాడు. ఇక మాళివిక నాయర్ తనకు అలవాటైన పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. అందంగా కనిపిస్తూనే తనదైన నటనతో అలరించే ప్రయత్నం చేసింది. రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, వెన్నెల కిషోర్, షావుకారు జానకి, ఊర్వశి, వాసుకి, రమ్యసుబ్రహ్మణ్యం, అంజు అల్వనాయక్..ఇలా చాలా మంది పాత్రధారులున్నా ఇందులో పెద్దగా నటించడానికి ఎవరికీ అవకాశం చిక్కలేదు. కారణం ప్రతి పాత్రను దర్శకురాలు నందినిరెడ్డి బలంగా రాసుకోలేకపోయింది కాబట్టి.
రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి తదితరులు తమ పాత్రల పరిధిమేరకు నటించి ఆకట్టుకున్నారు. వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, మహేష్ అక్కడక్కడా నవ్వించారు. వీరితో కూడా నందిని సరైన కామెడీ చేయించలేకపోయింది. ఓవరాల్‌గా సంతోష్ శోభన్ కు తప్ప నటించాడానికి ఎవరికీ పెద్దగా స్కోప్ దక్కలేదు.
సాంకేతిక నిపుణుల తీరు:
స్వప్న సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రతీ ఫ్రేమ్‌లోనూ ఆర్టిస్ట్‌లు చాలా వరకు కనిపించి కలర్ ఫుల్ ఫ్రేమ్‌ని చూపించినా నటనకు తగ్గ పాత్రలు కాకపోవడంతో టెక్నిషియన్లు కూడా ఏమీ చేయలేకపోయారు. అయితే సన్నీ కూరపాటి, రిచర్డ్ ప్రసాద్ ఫొటోగ్రపీ మాత్రం కలర్ ఫుల్ గా ఉంది. లేయాకు తోటల అందాలని ఆవిష్కరించిన తీరు, హీరో, హీరోయిన్ల మధ్య సాగే సన్నివేశాలని చూపించిన తీరు బాగుంది. జునైద్ ఎడిటింగ్, మిక్కి.జె మేయర్ అహ్లదమైన సంగీతం, అసభ్యతకు తావు లేని సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. టైటిల్ సాంగ్‌తో పాటు మరో రెండు పాటలు విన సొంపుగా ఉన్నాయి. అయితే వారి ఎఫర్ట్‌ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలో మాత్రం దర్శకురాలు నందిని రెడ్డి విఫలం కావడం గమనార్హం.
ఎలా ఉందంటే:
ఎలాంటి యాక్షన్ సన్నివేశాలకు..హడావిడికి తావులేకుండా సాగే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. 1920ల నాటి కాఫీతోటల గురించి వివరిస్తూ నందినిరెడ్డి టైటిల్ కార్డ్స్‌లో పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంటుంది. అయితే అంతే ఆసక్తిగా దివాకర్, ప్రసాద్ కుటుంబాల మధ్య డ్రామాని మాత్రం నడిపించలేకపోయింది. కథ, కథనాలు నెమ్మదిగా సాగడం కూడా సినిమాకు మరో మైనస్‌గా మారింది. దీంతో ప్రతీ సీన్ ప్రేక్షకుడి ఊహకందే విధంగా సాగుతూ ఆసక్తిని రేకెత్తించడంతో విఫలమైంది. రిషి, ఆర్యల ప్రేమ కథ విషయంలోనూ నందిని రెడ్డి జాగ్రత్తలు తీసుకోకపోగా కొన్ని సీన్లు బోర్ కొట్టించింది. సంతోష్ శోభన్, మాళవికల నటన, మిక్కిజే మేయర్ అందించిన పాటలు, పాతాక ఘట్టాలు మినహా సినిమాలో కొత్తనం లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా మిగిలింది.
పంచ్ లైన్:శకునం బాగాలేదు.
రేటింగ్: 2.5/5