Amitabh Bachchan: షూటింగ్ లో గాయపడ్డ అమితాబచ్చన్
Amitabh Bachchan: అమితాబచ్చన్ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వచ్చానా నిత్య యవ్వనుడిలా ఉంటాడు. ఇప్పటికీ బుల్లితెర, వెండితెరలపై నూతనోత్సాహంతో కనిపిస్తాడు. నేటి తరం హీరోలతో పోటీపడి మరి నటిస్తున్నాడు. బాలీవుడ్ కె పరిమితమైన అమితాబచ్చన్ ఈ మధ్య తెలుగు సినిమాల్లో కూడా నటించడం మొదలు పెట్టాడు..మనం సినిమా నుండి ప్రస్తుతం షూట్ జరుపుకుంటున్న ప్రాజెక్ట్ K సినిమా వరకు తెలుగు సినిమాలకు సైన్ చేసాడు. ప్రాజెక్ట్ కే షూటింగ్లో అనుకోకుండా జరిగిన ప్రమాదంలో అమితాబచ్చన్ కి గాయాలు అయినట్లు సమాచారం అందుతోంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
అమితా బచ్చన్ పక్కటెములకుగాయాలైనాయని సమాచారం. దీంతో అమితాబచ్చన్ ను హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం ముంబై కి వెళ్లి చికిత్స తీసుకుంటున్నట్లు వినికిడి. ప్రాజెక్టు కే సినిమా షూటింగ్ లో భాగంగా అమితాబచ్చన్ హైదరాబాద్ కు వచ్చారు. గతంలో కూడా టీఈ3ఎన్ చిత్ర షూటింగ్ సమయంలో బిగ్ బీకి గాయం అయిన విషయం తెలిసిందే.