Amala Paul: నటి అమలా పాల్ కు చేదు అనుభవం
Amala Paul: తెలుగు, తమిళ, మలయాళీ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న నటి అమలాపాల్. అన్ని బాషలలో ఈమెకు అభిమానులున్నారు. చాలారోజులనుండి తెలుగుసినిమాలకు దూరమైంది అమలాపాల్. తాజాగా కేరళ లోని ఓ ఆలయంలో అమలాపాల్ కు పరాభవం ఎదురైంది. కేరళలోని ఎర్నాకులంలోని తిరువైరాణికుళం మహాదేవ ఆలయంలో నటి అమలా పాల్ కు చేదు అనుభవం ఎదురైంది. మత వివక్ష కారణంగా తనను గుడిలోకి వెళ్ళడానికి అనుమతి నిరాకరించారని నటి అమలా పాల్ ఆరోపించారు. ఆలయంలోకి హిందువులను మాత్రమే అనుమతించే ఆచారాల కారణంగా దర్శనం నిరాకరించారని వాపోయారు. ఈ కాలంలో కూడా ఇంకా మతాచారాలేంటో నాకు అర్థంకావడంలేదని అన్నారు.
తనకు ఆలయ దర్శనం నిరాకరించి ఆలయం వెలుపల ఉన్న అమ్మవారి దర్శనం చేసుకోమని తనను బలవంతం చేశారని అమలాపాల్ పేర్కొన్నారు. నేను అమ్మవారిని చూడ లేకపోయినా ఆత్మను అనుభవించాను అని అమలాపాల్ పేర్కొన్నారు. ఈ 2023వ సంవత్సరంలో మతపరమైన వివక్ష ఇంకా కొనసాగడం విచారకరం ఈ విషయం నన్ను నిరాశపరిచింది. నేను దేవత దగ్గరికి వెళ్లలేకపోయాను కానీ దూరం నుంచి ఆత్మను ప్రార్థించాను. అని చెప్పింది. ఈ సంఘటనపై స్పందించిన అధికారులు తాము ప్రొటోకాల్ పాటిస్తున్నామని తెలిపారు. వివిధ మతాలకు చెందిన భక్తులు చాలా మందిఈ ఆలయాన్ని సందర్శించేందుకు వస్తున్నారని అయితే ఆ విషయం ఎవరికీ తెలియదని చెప్పారు.