Allu Arjun: విశాఖ అడవుల్లో పుష్పరాజ్
Allu Arjun: 2021 నుండి ప్రతి ఒక్కరు అనే మాట ‘తగ్గేదేలే’ అవును ఇది ఒక భారతదేశములోనే కాదు ప్రపంచమంతటా ఈ ఒక్క డైలాగ్ మారుమోగుతోంది. అల్లు అర్జున్ పుష్ప సినిమాలో చెప్పిన ఈ డైలాగ్ తో ఎక్కడికో వెళ్ళిపోయాడు.సామాన్య మానవునినుండి ఆటగాళ్లదాకా పుష్ప మ్యానియా మాత్రం కొనసాగుతుంది. సుకుమార్ అల్లు అర్జున్ ను ఎన్నడూ చూడని గెటప్ లో చూపించి అందరిచే ఔరా అనిపించుకున్నాడు. కోవిడ్ సమయంలో విడుదలైన ఈ సినిమా ఓ ప్రభంజనం సృష్టించిందనే చెప్పాలి. ఇక పుష్ప పార్ట్ 2 కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
తాజాగా ‘పుష్ప’ సినిమా రష్యాలోనూ విడుదల అయ్యింది. దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్, రష్మిక మందన్న సహా ఇతర సినిమాయూనిట్ రష్యాలో పర్యటించి ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. అక్కడకూడా విజయ ఢంకా మోగించింది. ఇక పుష్ప 1 కంటే పుష్ప 2 ను ఇంకా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు దర్శకుడు. పుష్ప 2 తాజా షెడ్యూల్‌ను వైజాగ్‌లో చిత్రీకరించబోతున్నారు. అందులో భాగంగా హీరో అల్లు అర్జున్‌పై కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. దాని కోసం ఆయన గురువారం హైదరాబాద్ చేరుకోనున్నారు. పది రోజుల పాటు వైజాగ్‌లో షూటింగ్ ప్లాన్ చేశారు మేకర్స్. ఇక ఫిబ్రవరి నుంచి సెట్స్ లోకి రష్మిక అడుగుపెట్టనుంది సమాచారం.