AlluArjun:స్టేజ్ పై స్టెప్పేసిన బన్నీ
AlluArjun: అల్లు అర్జున్ నటించి పుష్ప సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు ఎన్నడూ చేయని పాత్రలో బన్నీ నటించి మెప్పు పొందాడు. అలాగే ఇందులోని అన్నిపాటలు సూపర్ హిట్ అయ్యాయి. అందులో ఊ అంటావా మావా పాటి విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఒకానొక సందర్భంలో బాలీవుడ్ కండలవీరుడిని ఫెవరెట్ సాంగ్ లేదని అడిగితే ఊ అంటావా మావా అనే పాట అని చెప్పాడు. తాజాగా ఈ పాటకు బన్నీ అదిరిపోయే స్టెప్పులేశాడు.
హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సింగర్ మార్టిన్ గ్యారిక్స్ పుష్ప పాటలతో సందడి చేశాడు. ఈ కార్యక్రమానికి హాజరైన అల్లు అర్జున్ ఊ అంటావా మావా సాంగ్ కు స్టేజెక్కి స్టెప్పులేశాడు. తన స్టైలిష్ డ్యాన్స్ తో స్టేజ్ కిందున్న మ్యూజిక్ లవర్స్ లో జోష్ నింపాడు అల్లు అర్జున్. బ్లాక్ టీ షర్ట్ వేసుకున్న బన్నీ ‘ఐకాన్’ రాసి ఉన్న క్యాప్‌ను పెట్టుకొని స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు.