Allu Arjun:ఇండియన్ సినీరంగం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రకటన రానే వచ్చింది. కొన్ని నెలలుగా ఎప్పుడెప్పుడు కేంద్రం ఈ అవార్డుల్ని ప్రకటిస్తుందా? అని ఎదురు చూసిన అభిమానులు, సినీ లవర్స్‌కు గురువారం సాయంత్రం కేంద్రం శుభ వార్త చెప్పింది. 2021 సంవత్సరానికి గానూ జాతీయ చలన చిత్ర అవార్డుల్ని ప్రకటించింది. అయితే ఈ జాతీయ పురస్కారాలు తెలుగు సినీ చరిత్రలో అరుదైన ఘట్టానికి వేదికయ్యాయి.
Allu Arjun:ఇండియన్ సినీరంగం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రకటన రానే వచ్చింది. కొన్ని నెలలుగా ఎప్పుడెప్పుడు కేంద్రం ఈ అవార్డుల్ని ప్రకటిస్తుందా? అని ఎదురు చూసిన అభిమానులు, సినీ లవర్స్‌కు గురువారం సాయంత్రం కేంద్రం శుభ వార్త చెప్పింది. 2021 సంవత్సరానికి గానూ జాతీయ చలన చిత్ర అవార్డుల్ని ప్రకటించింది. అయితే ఈ జాతీయ పురస్కారాలు తెలుగు సినీ చరిత్రలో అరుదైన ఘట్టానికి వేదికయ్యాయి. 69 ఏళ్లుగా మనల్ని ఊరిస్తూ..ఉడికిస్తున్న జాతీయ పురస్కారం ఎట్టకేలకు తెలుగు హీరోని వరించింది.
`పుష్ప` సినిమాకు గానూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నారు. ఈ అవార్డు కోసం తెలుగు సినిమా 69 ఏళ్లుగా ఎదురు చూస్తోంది. ఇన్నాళ్లకు అ అవార్డు మన తెలుగు నటుడిని వరించడం విశేషం. తొలి సారిగా తెలుగు నటుడికి జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారం లభించడంతో ఇండస్ట్రీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇంత వరకు తెలుగు నటుడికి అందని ద్రాక్షలా ఊరిస్తూ వస్తున్న జాతీయ పురస్కారం ఇన్నేళ్ల తరువాత లభించడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఇన్నాళ్లుగా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ స్టార్స్‌ని మాత్రమే వరించిన జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం 69 ఏళ్ల నిరీక్షణ తరువాత తెలుగు నటుడికి తొలిసారి దక్కడం విశేషం. ఇలా తొలి సారి తెలుగు సినిమాకు జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని అందించిన తొలి హీరోగా అల్లు అర్జున్ అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నారు. ఇందు కోసం భారీ పోటీనే ఎదుర్కొన్నారు బన్నీ. ఉత్తమ నటుడి కేటగిరీలో అల్లు అర్జున్‌తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, సూర్య, ధనుష్, శింబు, ఆర్య, జోజు జార్జ్ పోటీపడ్డారు.
అయితే వీళ్లందరినీ అధిగమించి తగ్గేదేలా అనే స్థాయిలో పుష్పరాజ్ క్యారెక్టర్‌లో అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. దీంతో ఆరు దశాబ్దాలకు పైబడి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు కోసం నిరీక్షించిన టాలీవుడ్ కల ఎట్టకేలకు బన్నీ రూపంలో సాకారమైంది. దీంతో తెలుగు ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాలు, అభిమానులు ఫుల్ ఖుషీ అవుతూ సంబరాలు చేసుకుంటున్నారు.
బన్నీకి అదే కలిసోచ్చిందా?
`పుష్ప` సినిమాతో ఐకాన్ స్టార్‌గా మారిన బన్నీ టాలీవుడ్‌లో స్టైల్స్‌కు పెట్టింది పేరు. అందుకే స్టైలిష్ స్టార్ అనిపించుకున్నారు. వెండితెరపై తనదైన మార్కు స్టైల్స్‌తో ఆకట్టుకుంటూ వచ్చిన బన్నీ ఒక్కసారిగా తన మార్కుకు పూర్తి భిన్నంగా చేసిన సినిమా `పుష్ప`. ఇందులోని పుష్పరాజ్ క్యారెక్టర్. ఇది డీగ్లామర్ క్యారెక్టర్. అంటే బన్నీ స్టైల్‌కు పూర్తిగా భిన్నం. ఇతర భాషల వాళ్లు తప్ప క్యారెక్టర్ కోసం మన వాళ్లు కష్టపడరని, అలాంటి పాత్రల్లో మన స్టార్స్ నటించరనే అపవాదు చాలా ఏళ్లుగా జాతీయ స్థాయిలో ప్రధానంగా వినిపిస్తూ వస్తోంది. అది తప్పని క్యారెక్టర్ డిమాండ్ చేస్తే మన స్టార్ హీరోలు కూడా నేటివిటీతో సాగే ఊర మాస్ పాత్రల్లో కూడా నటించగలరని బన్నీ పుష్పరాజ్ క్యారెక్టర్‌తో చూపించారు. అదే ఇప్పుడు ఆయనకు అవార్డుని తెచ్చి పెట్టింది.
సుకుమార్ బన్నీ పాత్రని మలిచిన తీరు, ఈ సారి ఎలాగైనా సరే పతాక స్థాయిలో పేరు రీసౌండ్ ఇవ్వాలని దర్శకుడితో కలిసి బన్నీ పాత్ర కోసం ఎంత వరకు తగ్గాలో అంత వరకు తగ్గి నటించారు. వెండితెరపై బన్నీ కాకుండా కేవలం పుష్పరాజ్ మాత్రమే కనిపించేలా తనదైన నటనని పక్కన పెట్టి కొత్త బన్నీని తెరపై చూపించారు. అంతగా లీనమై పాత్ర మాత్రమే కనిపించాలని బన్నీ చేసిన ప్రయత్నం ఫలించి జాతీయ ఉత్తమ నడుడి పురస్కారాన్ని అందించింది. 69 ఏళ్లుగా కలగా మిగిలిపోయిన టాలీవుడ్ ఆశని నిజం చేసింది. అయితే మన స్టార్స్ క్యారెక్టర్ కోసం ఏం చేయడానికైనా సిద్ధమని ముందుగా నిరూపించిన స్టార్ రామ్ చరణ్. `రంగస్థలం` సినిమా సౌండ్ ఇంజినీర్ చిట్టిబాబు క్యారెక్టర్‌లో చరణ్ ఒదిగిపోయిన తీరుకు అంతా జాతీయ పురస్కారం కచ్చితంగా వస్తుందని భావించారు. కానీ అదే సమయంలో `మహానటి` సినిమాలో అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించి రామ్ చరణ్ ఆశల్ని కీర్తి సురేష్ ఆవిరి చేసి జాతీయ ఉత్తమనటి అవార్డుని ఎగరేసుకుపోయింది.