Allari Naresh: అల్లరినరేష్ ‘ఉగ్రం’ ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్
Allari Naresh అల్లరి నరేశ్ బాడీ లాంగ్వేజ్ ను .. డైలాగ్ డెలివరీని ప్రేక్షకులు ఇష్టపడని వారుండరు. హాస్య కథానాయకుడిగా అలరిస్తూనే, అడపా దడపా అల్లరి నరేశ్ కొన్ని ప్రయోగాత్మక పాత్రలను చేస్తూ వెళ్లాడు. ‘మహర్షి’ లో కామెడీ నటనకు బిన్నంగా నటించి మరోకోణంని పరిచయం చేసాడు. ఆతరువాత వచ్చిన ‘నాంది’ సినిమాలో నరేష్ ఎప్పుడు చూడని నటన కౌశల్యం చూపించాడు. ఈ సినిమాకి విజయ్ కనకమేడల దర్శకత్వం వహించాడు.
విజయ్ కనకమేడల అల్లరినరేష్ కాంబినేషన్ లో ‘నాంది’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నాంది మూవీ తరువాత మరోసారి ఈ కాంబినేషన్ లో వస్తూన్నసినిమా కావడంతో, ‘ఉగ్రం’పై కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. అందువలన ఈ మధ్య కాలంలో అల్లరి నరేష్ ప్రయోగాత్మక కథలను .. పాత్రలను చేయడానికే ఆయన ఎక్కువగా మొగ్గుచూపుతున్నాడు. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా వేసవి కానుకగా ఈ సినిమాను ఏప్రిల్ 14న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
నాగచైతన్య చేతుల మీదుగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయించారు. టీజర్ కు విశేష స్పందన వచ్చింది. నరేశ్ ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ దేవేరి ను రేపు విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. వర్షం పడుతుండగా అల్లరి నరేష్ , మిర్నా.. బైక్ పై కూర్చొని వున్న అనౌన్స్ మెంట్ పోస్టర్ ని చూస్తుంటే.. అందమైన రొమాంటిక్ మెలోడీ అనిపిస్తుంది. ఈ పాటకోసం అల్లరినరేష్ ఫాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
See you tomorrow at Sarath City Mall for the launch of #Deveri 🙂#Ugram #NareshVijay2@allarinaresh @mirnaaofficial @DirVijayK @sahugarapati7 @harish_peddi @Shine_Screens @SricharanPakala @anuragkulkarni_ @ShreeLyricist @jungleemusicSTH pic.twitter.com/OOLpFz76VY
— Allari Naresh (@allarinaresh) March 18, 2023