NBK Controversy: బాలకృష్ణ పై అక్కినేని అభిమానుల ఆగ్రహం
Nandamuri Balakrishna: వీరసింహా రెడ్డి సక్సెస్ మీట్‌లో కూడా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి. ‘అక్కినేని, తొక్కినేని’ అంటూ బాలకృష్ణ మాట్లాడిన వీడియోపై అక్కినేని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ వేడుకలో మాట్లాడిన బాలకృష్ణ.. సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లను అభినందించారు. ఈ క్రమంలోనే వేదికపై ఉన్న ఓ ఆర్టిస్ట్ గురించి మాట్లాడుతూ ఇక ఈయన ఉన్నారంటే సెట్‌లో నాన్నగారి డైలాగులు, ఆ రంగారావు, ఈ అక్కినేని, తొక్కినేని అన్నీ మాట్లాడుకుంటుండే వాళ్లం అని అన్నారు. అలా అనగానే అది ఎవరి గురించి అన్నారో అర్థం చేసుకుని సభలో ఉన్నవారంతా ఒక్కసారిగా షాకయ్యారు.
బాలకృష్ణ అక్కడ ఎవరిగురించి మాట్లాడారో అని అందరికి అరమైపోయింది. ఎవరూ ఈ విషయాన్ని అంత సీరియ్‌సగా తీసుకోలేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం దీని గురించి చర్చ మొదలైంది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే వివాదాస్పదం అవుతున్నాయి. దీనిపై అక్కినేని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. తెలుగు సినిమా ఇండస్టీని హైదరాబాద్ కి తీసుకొచ్చిన మహా నటుడు అక్కినేని అని అన్నారు. తాను నటిస్తూనే మరెందరికో అవకాశాలు కల్పించారు. మీ నాన్న కు అన్యాయం చేసి అధికారాన్ని మీ బావ లాక్కుంటే మీ నాన్న మాటల్లో ఆ నీచుణ్ని చంపి నాదగ్గరకు వచ్చేయ్ బాలయ్య అని ఆరోజు మీ నాన్న చెపితే ఇంతవరకు ఆయన కోరిక నెరవేర్చలేని ని హీరోయిజం ఎంతవరకు అని మేము ప్రశ్నించవచ్చు..కానీ అక్కినేని అభిమానులకు సంస్కారం ఉంది. మీ కుల,మత్తుమాటలు పక్కనపెట్టి బేషరత్తుగా అక్కినేనికుటుంబానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై బాలయ్య రెస్పాండ్ ఎలాఉండనుందో చూడాలి.