vaishnav tej: మంచు ప్రాజెక్ట్ మెగా కాంపౌండ్ లోకి వచ్చిందా ?
Vaishnav tej: వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా ఈ మధ్యనే ప్రకటించాడు. వైష్ణవ్ కి ఇది నాలుగో మూవీ. ఉప్పెన హిట్ తర్వాత కొండపొలం పరాజయం పాలైంది.ప్రస్తుతం ‘రంగ రంగ వైభవంగా’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పుడు వైష్ణవ్ చేస్తున్న సినిమా 2023 సంక్రాంతికి అని ప్రకటించారు మేకర్స్. నిజానికి సంక్రాంతి సీజన్ కోసం విపరీతమైన పోటీ నెలకొంది. విజయ్,ప్రభాస్ , చిరంజీవి, లాంటి స్టార్లందరూసంక్రాంతి మీదే కన్నేశారు. మరి ఇంతటి పోటీని ఈ యంగ్ హీరో తట్టుకోగలడా.
వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా పై ఒక వార్త ఫిలింనగర్లోవైరల్ అవుతుంది. దీనికి సంబందించిన విషయం ఒకటి బయటకు వచ్చింది. రెండేళ్ల కిందట కరోనాకు ముందు మంచు విష్ణు హీరోగా ‘అహం బ్రహ్మస్మి’ అనే సినిమా మొదలుపెట్టాడు. చాలా ఏళ్లుగా హిట్టు కోసం ఎదురుచూస్తున్న మనోజ్ కి ఇది బ్రేక్ ఇస్తుంది అన్నారు. దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్ ఈ స్టోరీని నేరేట్ చేసుకున్నాడు. కానీ లాక్ డౌన్స్ తర్వాత పరిస్థితి తారుమారైంది. అహం బ్రహ్మస్మి ఆగిపోవడంతో పాటు మనోజ్ పర్సనల్ డిస్టర్బెన్స్ వల్ల చిత్రం పై ఆసక్తి సన్నగిల్లి వదిలేశాడు.
ఇప్పుడా ‘అహం బ్రహ్మస్మి’నే వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందుతోందని ఇన్ సైడ్ టాక్. దాన్ని కొనసాగించలేనని మనోజ్ వదులుకుంటే ఈ ప్రాజెక్ట్ లో వైష్ణవ్ ని లాక్ చేశారట. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. నిజానికి రెండు కథలు ఒకటేనా కాదా అని చెప్పాల్సింది దర్శకుడే. రెండు సినిమాల ఫస్ట్ లుక్ ను పోల్చుకుంటే పోలికలు చాలా కనిపిస్తున్నాయి.