Naga Chaitanya: ఆకట్టుకుంటున్న చైతు ‘థాంక్యూ’ ట్రైలర్
Naga Chaitanya Thank You Trailer: ‘మనం’ సినిమా తర్వాత నాగచైతన్య విక్రమ్ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా థాంక్యూ. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రంలో రాశి ఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్ ఇందులో హీరోయిన్లుగా నటించారు. తమన్ మ్యూజిక్ అందించాడు.తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేసింది యూనిట్.
ఈ సినిమానుండి విడుదలైన సాంగ్స్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. ఫైనల్‌గా జూలై 22న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకురాబోతుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రొమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ.. సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ‘థ్యాంక్యూ’ట్రైలర్ ను తాజాగా బయటకు వదిలారు.
మనం ఎక్కడ మొదలయ్యామో మర్చిపోతే.. మనం చేరుకున్న గమ్యానికి విలువ ఉండదని నా ఫ్రెండ్ చెప్పాడు అంటూ చైతు చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఒక మనిషిని పట్టుకుని వేలాడే ప్రేమకంటే స్వేచ్చగా వొదిలేయగలిగే ప్రేమ ఎంతో గొప్పది అనే డైలాగ్ అందరి హృదయాలకు హత్తుకుపోతుంది. త్రి డిఫరెంట్ స్టేజెస్ లో హీరో లైఫ్ జర్నీను ట్రైలర్ లో చూపించారు.