Adavance Bookings: అడ్వాన్స్ బుకింగ్స్ లో టాప్ 3లో ఉన్న సినిమాలు ఇవే
Advancd bookings for Shah Rukh Khan Pathaan Movie
భారతదేశంలో సినిమాలను, క్రికెట్ మ్యాచులను జనాలు ఎగబడి మరీ చూస్తారు. దేశ ప్రజలకు ఇవే ప్రధాన వినోదాలు. సినిమాలలో సూపర్ స్టార్లకు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. వారి సినిమా రావడానికి కొన్ని నెలల ముందు నుంచే హంగామా మొదలౌతుంది. దర్శక నిర్మాతలు అభిమానులను దృష్టిలో ఉంచుకుని సినిమాకు చెందిన అప్ డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తూ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నారు. టీజర్లు, ట్రైలర్లు, క్యారెక్టర్ల పరిచయాలు అంటూ సోషల్ మీడియా ద్వారా హంగామా చేస్తున్నారు. సినిమా రావడానికి ముందే ఆ సినిమాపై విపరీతమైన ఆసక్తిని పెంచుతున్నారు. ఇలా చేసే ప్రమోషన్ల వల్ల కొన్ని సినిమాలకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. తాజాగా షారుఖ్ ఖాన్ నటించిన సినిమా పఠాన్ విషయంలో అదే జరుగుతోంది.
పఠాన్ సినిమా జనవరి 25న విడుదల కానుంది. సినిమా విడుదలకు వారం రోజుల క్రితమే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. దీంతో షారుఖ్ ఖాన్ అభిమానులు మొదటి రోజు సినిమా చూసేందుకు అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకున్నారు. కేవలం మూడు నాలుగు రోజుల వ్యవధిలోనే రెండున్నర లక్షల మందికి పైగా అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు. ఇటీవల కాలంలో ఇంత భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ దక్కించుకున్న సినిమా లేకపోవడం విశేషం.
4 సంవత్సరాల గ్యాప్ తర్వాత వస్తున్న షారుఖ్ ఖాన్ సినిమాను చూసేందుకు దేశంలోని చాలా నగరాల్లో ఉన్న అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. టిక్కెట్లు అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకుని తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు. గతంలో అడ్వాన్స్ బుకింగ్ విషయంలో అత్యధిక సంఖ్యను సొంతం చేసుకున్న సినిమాల గురించి ట్విట్టర్ వేదికగా వివరించాడు. కేజీఎఫ్ 2 సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో అన్ని సినిమాల కన్నా ముందు స్థానంలో నిలిచింది. ఆ సినిమాను చూసేందుకు ఏకంగా 5.15 లక్షల మంది అభిమానులు అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకున్నారు. ఆ తర్వాతి స్థానంలో బ్రహ్మాస్త సినిమా నిలిచింది. బ్రహ్మాస్త సినిమా తొలి రోజు చూసేందుకు 3.02 లక్షలు మంది అభిమానులు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు. మూడో స్థానంలో షారుఖ్ ఖాన్ సినిమా పఠాన్ నిలిచింది. పఠాన్ సినిమా చూసేందుకు 2.65 లక్షల మంది అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు.
TOP 3 ADVANCE BOOKINGS AT NATIONAL CHAINS [Post-pandemic]… *Day 1* ticket sales…
1. #KGF2: 5.15 lacs
2. #Brahmastra: 3.02 lacs
3. #Pathaan: 2.65 lacs* [3 days pending before release] pic.twitter.com/WPHHcHHhRy— taran adarsh (@taran_adarsh) January 21, 2023