Adivi Sesh: సీక్వెల్స్ పై ఫోకస్ పెడుతున్న అడివిశేష్
Adivi Sesh: గూడఛారి, ఎవరు, మేజర్ సినిమాలతో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు టాలీవుడ్ యాక్టర్ అడివిశేష్ . రీసెంట్‌గా శైలేష్ కొలను దర్శకత్వంలో నటించిన హిట్.. ది సెకండ్ కేస్ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది. ఈ సినిమా సక్సెస్‌తో ఫుల్ జోష్ మీదున్న అడివిశేష్ ప్రస్తుతం మరో సీక్వెల్‌తో బిజీగా కాబోతున్నాడు.
శశి కిరణ్ టిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన స్పై థ్రిల్లర్ గూడఛారి. త్వరలోనే గూడఛారి 2 పనులపై ఫోకస్ పెట్టాడు అడివిశేష్. ఈ సీక్వెల్ కూడా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్‌తోపాటు ఓటీటీ, శాటిలైట్ రైట్స్ కూడా భారీగా పలుకుతాయని టాలీవుడ్ సర్కిల్ టాక్. ప్రస్తుతం కొనసాగుతున్న శేష్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని, గూడఛారి 2 కథ రాయడం మొదలుపెట్టాలనుకుంటున్నాడట.
శశి కిరణ్ టిక్కాతో కలిసి స్క్రిప్ట్ వర్క్‌పాల్గొనబోతున్నాడంట అడివిశేష్. ఫస్ట్ పార్టును డైరెక్ట్ చేసిన శశి కిరణ్ ఈ సీక్వెల్ కూడా డైరెక్ట్ చేయబోతున్నట్టు సమాచారం. మరి గూడఛారి 2 ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేస్తుందోనని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు.శేష్ అభిమానులు. మరోవైపు హిట్ 3 చిత్రంలో అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు అడివిశేష్. బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లతో ఫుల్ జోష్ మీదున్న అడివిశేష్‌తో సినిమాలు చేసేందుకు బడా నిర్మాతలు రెడీగా ఉన్నా.. శేష్ మాత్రం సీక్వెల్ పై ఫోకస్ పెడుతూ వెళ్తున్నాడు.