Adipurush in 100days: మరో 100 రోజుల్లో ఆదిపురుష్ విడుదల, సోషల్ మీడియాలో డార్లింగ్ ఫ్యాన్స్ సందడి
Adipurush Movie will be released in 100 days, Prabhas Fans celebrations in Social media
హీరో ప్రభాస్ అభిమానులు కన్నులు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. తమ అభిమాన హీరో సినిమాను భారీ స్క్రీన్ ఎప్పుడు చూస్తామా అని వైట్ చేస్తున్నారు. ఆదిపురుష్ సినిమా విడుదల కావడానికి మరో 100 రోజులు సమయం మాత్రమే ఉన్నందున ఇప్పటి నుంచే హంగామా మొదలు పెట్టారు. సోషల్ మీడియాలో పలు వీడియోలను షేర్ చేస్తున్నారు. 100 రోజుల కౌంట్ డౌన్ అంటూ తెర సంబర పడిపోతున్నారు.
ఈ ఏడాది జనవరి నెలలోనే ఆదిపురుష్ సినిమా విడుదలకు సన్నాహాలు చేశారు. కొన్ని నెలల ముందు టీజన్ విడుదల చేశారు. ఆదిపురుష్ టీజన్ అన్ని వర్గాల ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచింది. ఓ కార్టూన్ సినిమాలా ఉందని ఎందరో విమర్శలు గుప్పించారు. రావణాసురుడు, లక్ష్మణుడు, హనుమంతుడు గెటప్స్ విషయంలో కూడా ఎన్నో అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో ఆదిపురుష్ దర్శక నిర్మాతలు పునరాలోచనలో పడ్డారు. పూర్తిస్థాయిలో మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించారు. సినిమా విడుదలను వాయిదా వేశారు. జూన్ 16న విడుదల చేస్తామని డేట్ ప్రకటించారు.మార్చి 7 నుంచి లెక్కకడితే జూన్ 16వ తేదీ రావడానికి ఇంకా 100 రోజుల సమయం ఉంది. దీంతో డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ హల్ చల్ మొదలు పెట్టారు.
బాహుబలి తర్వాత ఆ స్థాయిలో ప్రభాస్ సినిమాలేవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. సాహో కొన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చితే, రాధే శ్యామ్ సినిమా పూర్తిగా నిరాశ పరిచింది. ప్రాజెక్టు కే విడుదల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో అభిమానులు అందరూ ఆదిపురుష్ సినిమా కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.
ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్ర పోషిస్తున్నాడు. కృతి సనన్ సీతాదేవి పాత్రలో నటిస్తోంది. రావణాసురుడుగా సైఫ్ ఆలీ ఖాన్ నటిస్తున్నాడు. సైఫ్ ఆలీఖాన్ గెటప్ మీద అందరికంటే ఎక్కువ విమర్శలు వచ్చాయి. దీంతో దర్శకుడు ఓం రావత్ ఖంగు తిన్నాడు. విమర్శల దాడి తీవ్రం కావడంతో సినిమాను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే పనిలో పడ్డాడు.
#Prabhas' #Adipurush is going to hit the screens in next 100days… Can't wait to watch our Darling Prabhas on big screen as Lord Ram 🙏🏹 #AdipurushStormIn100Days pic.twitter.com/yb08E9NBLe
— Prabhas (@PrabhasRaju) March 7, 2023
#Adipurush 100 Days Countdown On March 7th from 8 PM 📢🔥
Ramudi Aagamanam🏹#Prabhas pic.twitter.com/A6n512d1Xt— Prabhas Cuts (@PrabhasHDCuts) March 4, 2023
Here is the tag to Celebrate 100 Days Countdown of #Adipurush 🏹
Shree Ramudi Agamanam🔥#AdipurushStormIn100Days #Prabhas pic.twitter.com/MQ7oKQ08io
— Bhanuprabha (@Bhanuprabha_) March 8, 2023