Samantha: సమంత భావోద్వేగం – కదలించేసింది
actress Samantha became emotional during Shakuntalam Press Meet
హీరోయిన్ సమంత కన్నీటి పర్యంతమయింది. శాకుంతలం ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఎమోషనల్ అయింది. జీవితంలో ఎన్ని బాధలు భరించినా సినిమా వదులుకోనని స్పష్టం చేసింది. అభిమానుల ద్వారా ఇంత ప్రేమ దొరుకుతుందని అనుకోలేదని సమంత తెలిపింది. భావోద్వేగానికి గురయింది. ఎంతో ఓపిక తెచ్చుకొని ట్రైలర్ రిలీజ్‌కు వచ్చానని తెలిపింది. శాకుంతలం సినిమా తరువాత అభిమానులకు తనపై మరింత ప్రేమ పెరుగుతుందని ధీమా వ్యక్తం చేసింది.
దర్శకుడు గుణశేఖర్ శాకుంతలం సినిమా గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. మాట్లాడుతూ ఉండగా కంటతడి పెట్టుకున్నారు. దాంతో అక్కడే ఉన్న సమంత కూడా భావోద్వేగానికి గురయింది. కంటతడి పెట్టుకుంది. అక్కడే ఉన్న కొందరు అభిమానులు గట్టిగా అరిచారు. దీంతో సమంత మళ్లీ నవ్వింది.
సమంత ప్రధాన పాత్రలో రూపొందిన శాకుంతలం సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించగా, దిల్ రాజు నిర్మించారు. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాను గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.