Haripriya Engagement: పాన్ ఇండియా నటుడితో పిల్ల జమీందార్ భామ వివాహం
Haripriya Engagement: నటి హరిప్రియ త్వరలో వివాహబంధంలోకి అడుగుపెట్టనుంది. ఇటీవలే తాను ప్రేమించిన విశిష్ట సింహాతో, హరిప్రియకు ఘనంగా నిశ్చితార్థం జరిగింది. వీరి నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫొటోలను వశిష్ట సింహా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట్లో వైరల్‌గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
హరిప్రియ ‘తకిట తకిట’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమయ్యారు. ఆ తర్వాత నానికి జోడీగా ‘పిల్ల జమీందార్’ సినిమాలో నటించి మెప్పించారు. ఆ సినిమాతో హరిప్రియ టాలీవుడ్ లో పలు ఆఫర్లను కూడా దక్కించుకుంది. ఈ వర్షం సాక్షిగా, గలాట, బాలకృష్ణకు జోడీగా ,జై సింహా,వంటి చిత్రాల్లో నటించి అభిమానులను సంపాదించుకుంది. ఇక వశిష్ట సింహా పాన్‌ఇండియా మూవీగా క్రేజ్ సందించిన ‘కెజిఎఫ్’ మూవీలో హీరోయిన్ అన్న పాత్ర పోషించారు. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని.. ఓ కుక్కపిల్ల వల్ల తాము ప్రేమించుకున్నామని ఇటీవల హరిప్రియ సోషల్‌మీడియా వెల్లడించిన సంగతి తెలిసిందే.