Srikanth iyengar:రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో ప్రముఖంగా కనిపించి నటుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీకాంత్ అయ్యంగార్ రివ్యూ రైటర్లపై మండిపడ్డారు. ఏదైనా మనం సాధించి మరొకరికి చెబితే బాగుంటుందని ఫైర్ అయ్యారు. ఆయన నటించిన తాజా చిత్రం `బెదురులంక 2012`.
Srikanth iyengar:రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో ప్రముఖంగా కనిపించి నటుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీకాంత్ అయ్యంగార్ రివ్యూ రైటర్లపై మండిపడ్డారు. ఏదైనా మనం సాధించి మరొకరికి చెబితే బాగుంటుందని ఫైర్ అయ్యారు. ఆయన నటించిన తాజా చిత్రం `బెదురులంక 2012`. కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించారు. నేహా శెట్టి హీరోయిన్గా నటించిన ఈ మూవీని క్లాక్స్ రూపొందించారు. యుగాంతం నేపథ్యంలో ఓ గ్రామంలో జరిగే నాటకీయ పరిణామాలతో ఆద్యంతం ఆసక్తికరంగా ఈ సినిమాని రూపొందించారు.
ఆగస్టు 25న భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాని విడుదల చేశారు. సినిమాకు సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ మీట్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినిమాకు సంబంధించిన కీలక టీమ్ అంతా పాల్గొంది. ఈ సందర్భంగా మాట్లాడిన నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ రివ్యూ రైటర్లపై సంచలన విమర్శలు చేశారు. `చావు కబురు చల్లగా` సినిమాలో కార్తికేయతో కలిసి నటించే అవకాశం లభించిందన్నారు.
ఎందుకంటే చూడటానికి బాగుంటాడు. మంచి నటుడు. `బెదురులంక 2012`లో అద్భుతంగా నటించాడు. ఇక మా అన్నయ్య అజయ్ ఘోస్ గురించి చెప్పాలంటే నటన విషయంలో ఆయనో తిమింగలం. ఈ సినిమా విషయంలో ఆయన దగ్గర నేర్చుకుని నటించే అవకాశం లభించింది. తెర వెనుక ఎంత కష్టపడ్డాం అనేది ప్రేక్షకులకు తెలియదు. తెరపై కనిపించేదే జనాలకు తెలుసు` అన్నారు. ఇదే సందర్భంగా రివ్యూస్‌పై ఫైర్ అయ్యారు.
రివ్యూస్, గివ్యూస్ రాస్తారు లెండి. మనమేదైనా సాధించి, ఇంకొకడి గురించి రాస్తే ఫరవాలేదు. కానీ కెమెరా వర్క్ రాదని ఎవడో అంటే మనమెందుకు ఇక్కడ ఉంటాం. `కాంతార` సినిమాకు ఒక్క రివ్యూ కూడా లేదు. జనాలు దాన్ని హిట్ చేయలేదా?. ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాళ్లకు ఒక విషయం నచ్చితే వాళ్లే థియేటర్లకు వచ్చి సినిమాని ఆదరిస్తారు. నచ్చకపోతే పట్టించుకోరు` అంటూ రివ్యూలపై ఫైర్ అయ్యారు.