హీరో నిఖిల్ ఇంట తీవ్ర విషాదం
టాలీవుడ్ నటుడు నిఖిల్ తండ్రి కావలి శ్యామ్ సిద్ధార్థ్ ఈరోజు కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన మృతితో నిఖిల్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఆయన గతంలో ఆర్మీలో పని చేసి రిటైర్ అయ్యి ఇంట్లోనే ఉంటున్నారు. శ్యామ్ సిద్ధార్థ్ మరణవార్త తెలిసి ఇండస్ట్రీ జనాలు షాక్ అయ్యారు. హ్యాపీడేస్ సినిమాతో నటుడిగా అరంగేట్రం చేసిన నిఖిల్ తన కెరీర్‌లో ఎన్నో చిత్రాలలో నటించారు. ప్రస్తుతం ఈ యువ నటుడు కార్తికేయ 2, 18 పేజీస్ సినిమాల్లో నటిస్తున్నారు. 18 పేజీస్ షూటింగ్ పూర్తి చేసి త్వరలో సినిమా విడుదల చేయడానికి సిద్దం అవుతున్నారు. ఇక మరోపక్క నిఖిల్ ‘స్పై’ అనే పాన్ ఇండియా మూవీని కూడా ప్రకటించారు.