Actor Laya: ఇచ్చిన మాట పవన్ నిలబెట్టుకున్నారు .. లయ
Actor Laya: తెలుగు సినిమా నటి లయ అందరికి గుర్తే ఉంది ఉంటుంది. స్వయంవరం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంటరై వరుస సక్సెస్ సినిమాలలో నటించి అందరిచే శబాష్ అనిపించుకుని మంచి నటిగా గుర్తింపు పొందింది. కొన్ని సంవత్సరాలుగా సినిమా ఇండస్టీకి దూరమైనా లయ తాజాగా కొని విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది. అందులోను పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికరమైన విషయాన్నీ తెలిపింది.
తాను పవన్ కళ్యాణ్ తో నటించలేదని.. కానీ తన పెళ్ళికి ఆయన్ని ఇన్వైట్ చేస్తే వచ్చారని అన్నారు. అసలు ఆయనతో యాక్ట్ చేయలేదు. ఆయనకు రావాల్సిన అవసరం కూడా లేదు. కానీ వస్తానని ఇచ్చిన మాట కోసం ఆయన వచ్చారని గుర్తు చేసుకున్నారు. అమెరికాలో సెటిల్ అయిన డాక్టర్ గణేష్‌ను లయ 2006లో పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో పెళ్లికి రావాలంటూ ఆహ్వానించటానికి చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారట ఆమె పవన్ కళ్యాణ్‌కి నేనెవరో పెద్దగా తెలియక పోవచ్చు కదా మరి పిలిస్తే ఆయన వస్తారా ? అని ఆలోచనతోనే వెళారట లయ.
నేను వచ్చిన విషయం తెలియగానే పవన్ లోపలికి పిలిచి మాట్లాడారు. పెళ్లి ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత తప్పకుండా వస్తానని అన్నారు. అయితే ఆయన రారనే అనుకున్నాను. కానీఅందరికీ కంటే ముందే పవన్ కళ్యాణ్‌గారు పెళ్లింట్లో ప్రత్యక్షమయ్యారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే ఆయన పెళ్లికి చాలా సింపుల్‌గా, ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా సడెన్‌గా వచ్చేశారు. అదే సమయంలో నాతో మాట్లాడుతూ అన్నయ్య వెనక వస్తున్నారని అని అన్నారు. అతిథి మర్యాదలు చేసే అవకాశం కూడా తనకి ఇవ్వలేదని తెలిపింది. తన జీవితంలో ఎంతో విలువైన క్షణాలు అవి అని లయ అన్నారు.