Dhanush: ధనుష్ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన ‘ది గ్రే మ్యాన్’ యూనిట్
Dhanush The Gray Man:ఫేమస్ హాలీవుడ్ డైరెక్టర్స్, రూసో బ్రదర్స్ ఆంటోనీ, జో తెరకెక్కించిన సినిమా ‘ది గ్రే మ్యాన్’.జూలై 22న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలవుతోంది.ఇందులో ర్యాన్ గోస్లింగ్ హీరో.క్రిస్ ఇవాన్స్, అనా డి ఆర్మాస్, ధనుష్ కీలక పాత్రల్లో నటించారు.అతి త్వరలో ముంబైలో ‘ది గ్రే మ్యాన్’ షో వేస్తున్నారు.ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ధనుష్ ఫస్ట్ లుక్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ ట్రైలర్లో ధనుష్ కొంచెంసేపు మాత్రమే కనిపించాడు. దీంతో అభిమానులు కొంచం నిరాశకు గురయ్యారు.
తాజాగా ధనుష్ అభిమానుల కోసం ఫుల్ వీడియోను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ వీడియో చూసిన ధనుష్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.ఈ చిత్రంలో ధనుష్ నెగిటివ్ రోల్ లో నటిస్తున్నాడు.
రూసో బ్రదర్స్ ఇటీవల ఇచ్చిన ఓతాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ”మేం తెరకెక్కించిన కొత్త సినిమా ‘ది గ్రే మ్యాన్’ ని చూడటానికి, ధనుష్‌ను చూసేందుకు ఇండియాకు రాబోతున్నాం. ఇందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. త్వరలో ఇండియాలో కలుద్దాం” అని తెలిపారు.
Ladies and gentlemen, we give you…@dhanushkraja #TheGrayMan pic.twitter.com/abPLFxHq6B
— Russo Brothers (@Russo_Brothers) July 12, 2022