ప్లాప్ టాక్ తెచ్చుకున్నా రికార్డ్ కలెక్షన్స్ రాబట్టిన ‘ఆచార్య’
మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ తెరకెక్కించిన ఈ లేటెస్ట్ భారీ సినిమా నిన్ననే గ్రాండ్ గా రిలీజ్ అయ్యిన సంగతి తెలిసిందే. మంచి అంచనాలు నడుమ రిలీజ్ అయ్యిన ఈ చిత్రానికి తొలిరోజు మిశ్రమ స్పందన లభించింది. ఈ నేపథ్యంలో ఫస్ట్‌డే కలెక్షన్స్ కాస్త తగ్గాయి. ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 40 కోట్ల గ్రాస్, 29.5 కోట్లు షేర్ సొంతం చేసుకుందని టాక్ నడుస్తోంది. అయితే ఒకరకంగా చూస్తే ‘ఆచార్య’ తెలుగు రాష్ట్రాల్లో ఫెంటాస్టిక్ వసూళ్లనే అందుకున్నట్టు చెబుతున్నారు.
మిక్స్డ్ టాక్ అందుకున్నా ఇంత గ్రాస్ ని రాబట్టింది అంటే విశేషమనే చెప్పాలి. అయితే పాజిటివ్ టాక్ కనుక వచ్చి ఉంటే ఇంతకంటే ఎక్కువే రాబట్టేది అని అంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఇక మొదటి రోజు ప్రపంచవ్వాప్తంగా 42 కోట్లు గ్రాస్, 31. కోట్లు షేర్ సాధించినట్లు సమాచారం. మరి ముందు ముందు ఆచార్య ఎలాంటి రికార్డులను అందుకుంటుందో చూడాలి.